ఆనాటి హీరో “దగ్గుబాటి రాజా” గుర్తున్నారా..?? ఇప్పుడు ఎలా ఉన్నారంటే..??

ఆనాటి హీరో “దగ్గుబాటి రాజా” గుర్తున్నారా..?? ఇప్పుడు ఎలా ఉన్నారంటే..??

by Anudeep

Ads

మూవీ మొఘల్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత డి.రామానాయుడు కుటుంబం నుంచి ఆయన తనయుడు సురేశ్, వెంకటేశ్ ఇండస్ట్రీలో ఆయన వారసులుగా కొనసాగుతున్నారు. వారి తర్వాతి తరం లో దగ్గుబాటి రానా మంచి నటుడిగా ఇప్పటికే గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక రానా తమ్ముడు దగ్గుబాటి అభిరాం కూడా వెండి తెరపై అడుగుపెట్టారు.. అయితే రామానాయుడు అన్నయ్య కుమారుడు దగ్గుబాటి రాజా. ఈయన రెండు దశాబ్దాల పాటు తమిళ చిత్రాల్లో స్టార్ హీరోగా వెలుగొందాడు.

Video Advertisement

దగ్గుబాటి రాజా అసలు పేరు వెంకటేష్. సినిమాల కోసం రాజా గా మార్చుకున్నారు. తెలుగులో ఈయన తక్కువ చిత్రాల్లోనే నటించారు కానీ తమిళ్ లో మాత్రం మంచి పేరు తెచ్చుకున్నారు. ఈయన తమిళ్, తెలుగు, మలయాళం భాషల్లో 60 కి పైగా చిత్రాల్లో నటించారు. 80 , 90 దశకాల్లో గ్గుబాటి రాజా నటించిన సినిమాలు వరుసగా విజయం సాధించాయి.ఈ క్రమంలోనే ఇండస్ట్రీ వారు సినీ అభిమానులు హీరోగా స్టార్ రేంజ్‌కు దగ్గుబాటి రాజా త్వరలో వెళ్తాడని అనుకున్నారు. కానీ అనుకోని విధంగా ఆయన సినిమాలకు దూరం అయ్యారు.

did you remember this senior daggubati hero..!!

చాలా కాలం పాటు సినిమాల్లో అవకాశాల కోసం వెయిట్ చేసిన దగ్గుబాటి రాజా. ఆ తర్వాత కాలంలో అవకాశాలు రాకపోవడంతో సినిమాల నుంచి నిష్క్రమించినట్లు తెలుస్తోంది. తన తండ్రి గ్రానైట్ వ్యాపారంలో అడుగుపెట్టి సక్సెస్ కావడం తో అక్కడే స్థిరపడిపోయారు రాజా. అప్పట్లో దగ్గుబాటి రామానాయుడు రాజా హీరోగా నటించినటువంటి పలు చిత్రాలకు సహ నిర్మాతగా కూడా వ్యవహరించాడు. అయినప్పటికీ టాలీవుడ్ లో దగ్గుబాటి రాజా హీరోగా మాత్రం నిలదొక్కుకో లేకపోయాడు.

did you remember this senior daggubati hero..!!

సినిమా అవకాశాలు తగ్గి పోయిన సమయంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలలో కూడా నటించాడు. అంతేగాక పలు చిత్రాలకు సహా నిర్మాతగా కూడా వ్యవహరించాడు రాజా. ఇక ఆ తర్వాత చాలా గ్యాప్ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ చేసిన రాజా తెలుగులో ముఖ దర్శకుడు క్రిష్ దర్శకత్వం వహించిన ఎన్టీఆర్ కథానాయకుడు, మహా నాయకుడు చిత్రాల్లో సీనియర్ ఎన్టీఆర్ తమ్ముడు త్రివిక్రమరావు పాత్రలో నటించారు. అలాగే తమిళ భాషలోని “ఆదిత్య వర్మ” చిత్రంలో కూడా హీరో ఫాదర్ క్యారెక్టర్ లో నటించాడు.


End of Article

You may also like