Ads
‘మహర్షి’.. 1987లో వచ్చిన ఈ మూవీ అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించింది. ఈ సినిమాలోని ప్రతిపాట సూపర్ హిట్. ఈ చిత్రంలో ఇళయరాజా స్వరపరచిన ‘ ‘ మాటరాని మౌనమిది’ , ‘ ‘ సుమం ప్రతి సుమం సుమం’ ‘ అనే సాంగ్స్ శ్రోతలను ఇప్పటికీ అలరిస్తాయి. వంశీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రాఘవ, శాంతి ప్రియ హీరోహీరోయిన్లుగా నటించారు.
Video Advertisement
శాంతి ప్రియ తన ఫస్ట్ మూవీతోనే ఎంతో మంచి గుర్తింపు పొందింది.తన అందం, అభినయంతో ఎంతో మంచి అభిమానులను సంపాదించుకుంది. ఆ అందాల తార మరెవరో కాదు.స్వయంగా స్టార్ హీరోయిన్ భాను ప్రియచెల్లెలు.
‘ఎంగ ఊరు పాట్టుకరన్’ అనే తమిళ సినిమాతో సినీ రంగంలోకి వచ్చింది. సౌత్, నార్త్ అనే తేడా లేకుండా తన అందచందాలతో ఎంతగానో ఆకట్టుకుంది. కొంతకాలం పాటు తన గ్లామర్ పాత్రలతో జనాలను అలరించిన ఆమె. ఆ తర్వాత సినిమా పరిశ్రమకు దూరం అయ్యింది.తన చివరి సినిమా అక్షయ్ కుమార్ సరసన ఇక్కే పే ఇక్కా సినిమాలో యాక్ట్ చేసింది. 1995లో ఆమె సిద్ధార్థ్ రేను వివాహం చేసుకుంది.కానీ 2004లో సిద్ధార్థ్ చనిపోయాడు. ఆమెకు ఇద్దరు కొడుకులు.
మహర్షి సినిమా తర్వాత జగపతి బాబు హీరోగా సింహ స్వప్నం అ సినిమాలో నటించింది. ఆ తర్వాత రాజశేఖర్‌తో కలిసి యమపాశం, శిలాశాసనం సినిమాలు చేసింది. నాగార్జునతో అగ్ని, రమేశ్ బాబుతో కలియుగ అభిమన్యుడు, నరేశ్‌తో జస్టిస్ రుద్రమదేవి సినిమాలు చేసింది. బాలీవుడ్ లో వరుస ఆఫర్లు రావడంతో తెలుగులో సినిమాలు తగ్గిపోయాయి.
దాదాపు మూడు దశాబ్దాల తర్వాత 53 సంవత్సరాల వయసులో సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది శాంతి ప్రియ. ఈ మధ్య సునీల్ శెట్టి, వివేక్ ఓబెరాయ్ నటించిన ‘ధారావి బ్యాంక్’ అనే వెబ్ సిరీస్‌తో రీ ఎంట్రీ ఇచ్చింది. సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గానే ఉందే శాంతి ట్రెడిషన్, ట్రెండీ ఫ్యాషన్‌లో కనిపిస్తూ లేటెస్ట్ పిక్స్ షేర్ చేస్తుంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తాను మళ్లీ సినిమాల్లో నటించాలి అని భావిస్తున్నట్లు చెప్పింది.
End of Article