Ads
బాగా ఆకట్టుకునే నటులని మనం ఎప్పటికీ మర్చిపోలేము. అలానే మనకి బాగా దగ్గరైన యాంకర్లను కూడా మనం గుర్తు పెట్టుకుంటూ ఉంటాము. ఎక్కువగా అలరించి సందడి చేసిన యాంకర్స్ ని మర్చిపోవడం కాస్త కష్టం. అప్పట్లో జెమినీ టీవీ, ఈటీవీ మాత్రమే ఉండేవి. ఈటీవీ కంటే కూడా జెమినీ టీవీ ఎక్కువ ప్రోగ్రాంస్ ని నిర్వహించేది.
Video Advertisement
జెమినీ టీవీ 80 వ దశకం లో ప్రారంభమయ్యింది. ఛానెల్ తో పాటుగా సాటిలైట్ కూడా 80 వ దశకం లోనే మొదలయింది. అప్పట్లో ఇతర చానల్స్ ఎక్కువగా లేక పోవడం వలన జెమినీ టీవీ లో పని చేసే యాంకర్స్ కి మంచి ఆదరణ లభించేది.
జెమినీ టీవీ అప్పుడు ప్రజలకు బాగా దగ్గరగా ఉండడంతో ఆ యాంకర్స్ ని బాగా గుర్తు పెట్టుకున్నారు జనం. ఆ యాంకర్స్ కి భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ కూడా ఇచ్చేవారు. వాళ్ళలో కొందరు స్టార్ హీరోయిన్లు కూడా అయ్యారు. ప్రోగ్రామ్స్ ద్వారా ఎప్పుడూ ప్రజలకి దగ్గరగా ఉంటే ఈ యాంకర్లు జనాన్ని బాగా ఆకట్టుకున్నారు. మరి ఆ యాంకర్ల గురించి ఇప్పుడు చూద్దాం. మరి మీకు గుర్తు ఉన్నారో లేదో చూడండి.
#1. జాహ్నవి:
జాహ్నవి అప్పటి యాంకర్లలో ఒకరు. జెమినీ టీవీ లో అప్పట్లో డాన్స్ బేబీ డాన్స్ ప్రోగ్రాం వచ్చేది. దీనికి ఆమె యాంకర్ గా ఉండేవారు. తర్వాత ఆమె సినిమాల్లో కూడా నటించారు. పెళ్లి అయిపోయిన తర్వాత ఇంక సినిమాల్లోకి రావడం మానేశారు.
#2. జయతి:
జయతి కూడా జెమినీ మ్యూజిక్ ద్వారా ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. జెమినీ మ్యూజిక్ ఆదిత్య టీవీ అయినప్పుడు 10 గంటలకు వచ్చే వెన్నెల షో కి జయంతి వచ్చేవారు.
#3. అనుపమ:
ఈమె కూడా అప్పట్లో మంచి యాంకర్ గా పని చేశారు. ఆట కావాలా పాట కావాలా తో స్టార్ యాంకర్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు అనుపమ.
#4. రజినీ:
రజినీ కూడా కొన్ని షోలలో యాంకర్ గా పని చేశారు. సీరియల్స్ లో కూడా ఈమె నటించారు.
#5. అర్చన:
అర్చన కూడా మంచి పేరు పొందారు. నీకోసం లో పుట్టినరోజు విషెస్ ని చెప్పేవారు. ఆ తర్వాత ఈమె జాడలేదు. అయితే అప్పట్లో పేరు పొందిన యాంకర్స్ ఇప్పుడు ఎక్కడా కనబడటం లేదు. కేవలం ఇంటికే పరిమితం అయిపోయారు వీళ్ళు.
End of Article