Ads
లెజెండ్ శరవణన్..శరవణ స్టోర్స్ యజమాని శరవణన్.. మనకు వెంటనే గుర్తు రాకపోయినా మీమర్స్ కి మాత్రం ఈ పేరు ఈజీగా గుర్తుంటుంది. ఎందుకంటే శరవణన్ కు సంబంధించి చేసే మిమ్స్ కు ఎంత క్రేజ్ ఉందో వాళ్లకు మాత్రమే తెలుసు.
Video Advertisement
ప్రస్తుతం దసరా సందర్భంగా ఆయుధ పూజ రోజు ఆటో డ్రైవర్లతో కలిపి ఆయుధ పూజ జరుపుకున్న శరవణన్ తిరిగి మీమర్స్ కు బంపర్ ఆఫర్ ఇచ్చాడు.
తన ఎల్లో కలర్ లంబోర్ఘిని హురాకాన్ LP 610-4 లో ఆయుధ పూజ జరపడానికి వచ్చిన శరవణన్ కు ఆటో డ్రైవర్లు ఎంతో ప్రేమతో స్వాగతం పలికారు. పూజ అయిన తర్వాత డ్రైవర్లతో కాసేపు ముచ్చటించి వారి కోరిక మేరకు ఆటోని కూడా తోలాడు శరవణన్. ఇంతవరకు బాగానే ఉంది కదా ఇందులో మీమర్స్ కు పనేంటి అని అనుకుంటున్నారా. శరవణన్ మేకప్ విషయంపై ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ డిస్కషన్ జరుగుతుంది.
ఇంతకుముందు శరవణన్ లుక్ ఎలా ఉందో అందరికీ తెలుసు.. ఇప్పుడు తన లుక్ ని పూర్తిగా మార్చుకున్న అతని చూసి సడన్గా ఎవరు గుర్తుపట్టలేకపోతున్నారు. ఫుల్ మేకప్ మీద లైట్ గా గడ్డం పెట్టుకొని బ్లాక్ సూట్ మీద ఎల్లో కలర్ ఫ్లోరల్ జాకెట్ తో స్టన్నింగ్ గా ఉన్నాడు. ఈ గెటప్ చూసిన మీమర్స్ మేకప్ లో కాస్త ఫేస్ తక్కువయినట్లుంది అంటూ.. తమదైన శైలిలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
ALSO READ : రీసెంట్ గా సూపర్ హిట్ అయిన ఈ పాట ఈయనదా.? కాపీ కొట్టారా.?
End of Article