ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జానపద పాటలకు ఎంత ఫేమస్ అందరికీ తెలిసిందే. శ్రీకాకుళం ఫోక్ సాంగ్స్ అంటే అందరూ విశేషంగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అక్కడ ఎంతోమంది ఫోక్ సింగర్లు లైమ్ లైట్ లోకి వచ్చారు. అక్కడి పాటలు ఎంతగానో నచ్చి తెలుగు సినిమాల్లో ఆ పాటలను పెట్టుకున్న సందర్భాలు కోకొల్లలు.

Video Advertisement

ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్.పి పట్నాయక్ అయితే శ్రీకాకుళం పాటలను తాను మ్యూజిక్ చేసిన సినిమాల్లో పెడుతూ హిట్లు కొట్టేవారు.ఇక నాది నక్కిలీసు గొలుసు సాంగ్ ఎంతగా హిట్ అయిందో చెప్పనవసరం లేదు. ఆ సాంగ్ వల్లే పలాస సినిమాకి క్రేజ్ ఏర్పడింది.

ఆ తర్వాత పల్సర్ బైక్ సాంగ్ కూడా యువతని ఒక ఊపు ఊపేసింది. ఆ సాంగ్ కి ఉన్న క్రేజీ ను చూసి రవితేజ నటించిన ధమాకా సినిమాలో ఆ సాంగ్ నీ పెట్టుకున్నారు. ఇప్పుడు అదే కోవలో కోటబొమ్మాలి పిఎస్ అనే సినిమాలో శ్రీకాకుళం ఫేమస్ సాంగ్ లింగ్ లింగ్ లింగ్ లింగ లింగిడి సాంగ్ ను పెట్టారు. ఈ పాట రిలీజ్ అవ్వగానే సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయింది. సినిమా మీద విపరీతమైన హైప్ తీసుకువచ్చింది.ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ గీత ఆర్ట్స్ నిర్మించడం విశేషం.

ఇప్పుడు ఆ పాట తనపై అంటూ తన పాటను కాపీ కొట్టారంటూ శ్రీకాకుళానికి చెందిన జానపద గాయకుడు మల్లేష్ మీడియా ముందుకు వచ్చాడు. 40 సంవత్సరాల క్రితమే ఈ పాట తాను రాసినట్లు చెప్పుకొచ్చాడు. బోనేలు కుండ వృత్తిలో వేషాలు కట్టి ఆడేటప్పుడు ఈ పాటను తాను పాడేవాడని తెలిపాడు. ప్రతి ఇంటికి తిరుగుతూ ఈ పాట పాడుతూ తన పొట్ట పోసుకుంటున్నానని అన్నాడు. అయితే తన పాటను వేరే అతను పాడి తన పాటుగా చెప్పుకుంటున్నాడని, సినిమా టీం కూడా తనకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని తెలిపాడు. ఈ విషయం పైన సినిమా బృందం స్పందిస్తుందేమో వేచి చూడాలి.

watch video:


Also Read:అల్లు అర్జున్ ఇంట్లోనే జాతీయ అవార్డు ఉందా…!