అల్లు అర్జున్ ఇంట్లోనే జాతీయ అవార్డు ఉందా…!

అల్లు అర్జున్ ఇంట్లోనే జాతీయ అవార్డు ఉందా…!

by Mounika Singaluri

Ads

ఇటీవల ప్రకటించిన 69 వ జాతీయ అవార్డులలో పుష్ప చిత్రానికిలో తన నటనకు గాను అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. తెలుగు చిత్ర సీమలో ఇప్పటివరకు ఏ హీరోకి దక్కని గౌరవం అల్లు అర్జున్ కి దక్కింది. తెలుగు ఇండస్ట్రీకి ఉత్తమ జాతీయ నటుడి అవార్డు లేదని లోటు అలాగే ఉండిపోయింది.

Video Advertisement

కానీ ఇప్పుడు ఆ లోటును అల్లు అర్జున్ తీర్చారు. తాజాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ చేతుల మీదుగా అల్లు అర్జున్ ఈ అవార్డును తీసుకున్నారు. అల్లు అర్జున్ ఈ అవార్డు అందుకున్న సందర్భంగా తెలుగు ఇండస్ట్రీ తో పాటు ఇండియాలోని అన్ని రంగాల వారు అల్లు అర్జున్ శుభాకాంక్షలు తెలియజేశారు.

తాను నటిస్తున్న పుష్ప నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ అయితే ఏకంగా జాతీయ అవార్డులు పొందిన వారి కోసం పార్టీని ఏర్పాటు చేసి అభినందనలు తెలియజేశారు. జాతీయ అవార్డు తన పైన మరింత బాధ్యత పెంచిందని అల్లు అర్జున్ ప్రకటించారు.ఇది ఇలా ఉంటే చాలామందికి తెలియని మరొక విషయం కూడా ఉంది నిజానికి అల్లు అర్జున్ జాతీయ అవార్డు అందుకోక ముందే అతని ఇంట్లో వారి పేరు జాతీయ అవార్డులు ఉన్నాయి.

అల్లు అర్జున్ తాత అయిన అల్లు రామలింగయ్య కమెడియన్ గా భారతదేశం అంతా తెలుసు. అల్లు కుటుంబీకులు ఆయన గుర్తుగా ఆయన పేరు మీదనే ఎందరో ప్రతిభావంతులకు జాతీయ అవార్డులను అందిస్తున్నారు.అల్లు రామలింగయ్య అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ తెలుగు ఆయన స్మారకార్థం ఈ జాతీయ అవార్డును నెలకొల్పింది. ప్రతి సంవత్సరం ఈ అవార్డును తెలుగు చలనచిత్ర ప్రముఖులకు ఇచ్చి సత్కరిస్తున్నారు.

ఇక అల్లు రామలింగయ్యకు ఇద్దరు పిల్లలు. కుమార్తె సురేఖను మెగాస్టార్ చిరంజీవికి ఇచ్చి వివాహం చేయగా కుమారుడు అల్లు అర్జున్ నిర్మాతగా గీత స్థాపించి ఎన్నో హిట్ చిత్రాలను నిర్మించారు. ఇలా అల్లు కుటుంబంలోనే జాతీయ అవార్డులు ఉండటం అల్లు అభిమానులు గర్వంగా ఫీల్ అవుతున్నారు.

Also Read:“సుహాసిని” నుండి… “నయనతార” వరకు… “డైరెక్టర్స్”ని పెళ్లి చేసుకున్న 9 మంది హీరోయిన్లు..!


End of Article

You may also like