శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన సొంతం సినిమా ఎంత హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఈ సినిమాలో ఆర్యన్ రాజేష్ హీరోగా నటించాడు. నమిత హీరోయిన్. ఇంకా ఇందులో నటుడు రోహిత్ కూడా ఉన్నాడు. కానీ ఈ సినిమాలో వీరందరికి రాణి పేరు కమెడియన్ సునీల్ కి వచ్చింది. ఈ చిత్రం లో ఏకంగా సునీల్ నలభై నిమిషాల పాటు కనిపిస్తాడు. ఈ చిత్ర విజయం లో సునీల్, అతడి కామెడీ దే కీలక పాత్ర. అంతే కాకుండా ఈ చిత్రం లో యంగ్ హీరో అడివి శేష్ కూడా ఒక చిన్న పాత్రలో నటించారు.

Video Advertisement

అయితే ఈ చిత్రం లో హీరో రోహిత్ కి జంటగా మరాఠీ నటి నేహా పెండ్సే నటించారు. ఆ సినిమాని మలుపు తిప్పే పాత్రలో ఆమె నటించింది. ఈమె హిందీ లో వచ్చిన ప్యార్ కోయి ఖేల్ నహిన్ చిత్రం లో బాలనటిగా పరిచయమయ్యారు. దేవదాస్ చిత్రం లో కూడా ఆమె నటించారు. ఆ తర్వాత పలు హిందీ కార్యక్రమాల్లో నటించారు. ఈమె హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, మరాఠీ సినిమాల్లో నటించారు. ఆ తర్వాత ఆమె 2018 లో హిందీ బిగ్ బాస్ సీజన్ 12 లో కూడా పాల్గొన్నారు.

did you remember this actress from sontham movie..

ఈమె ప్రస్తుతం హిందీలో ప్రసారమవుతున్న ‘భాబీజీ ఘర్ పర్ హైన్‌’ అనే కామెడీ కార్యక్రమం లో నటిస్తున్నారు. ఇందులో అనితా విభూతి నారాయణ్ మిశ్రా పాత్రతో మరింత గుర్తింపు వచ్చింది. అంతే కాకుండా ‘కపిల్ శర్మ’ కార్యక్రమం లో ఆమె కొంతకాలం యాంకర్ గా కూడా చేసారు. ఈమె 2020 లో శార్దూల్ సింగ్ బయాస్‌ ని వివాహం చేసుకున్నారు.

did you remember this actress from sontham movie..
సోషల్ మీడియా లో యాక్టీవ్ గా ఉండే నేహా తన ఫోటోలని ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేస్తూ ఉంటారు. ఆమె ఫోటోలని చూసినా ఆమె ఫాన్స్ ఆశ్చర్యపోతున్నారు. సొంతం సినిమాలో నటించే సమయానికి ఇప్పటికి ఆమె చాలా మారిపోయారంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికీ పలు షో తో బిజీ గా ఉన్న ఆమె తన కెరీర్ లో ఇలాగే దూసుకుపోవాలని ఆమె ఫాన్స్ ఆశిస్తున్నారు.

#1.

#2.

#3.

#4.

#5.

#6.

#7.

#8.

#9.