Ads
రెగ్యులర్ సినిమాలు చూసేవారికి అలవాటైన భాష 35mm , 70mm. ఇప్పటి జనరేషన్ వాళ్ళకి అయితే అవేంటో అసలు తెలీదు. పాత సినిమాల్లో టైటిల్ తో పాటు వాటి mm సైజు కూడా రాసేవారు. వీటిని చాలా మంది సినిమా హాల్లోని స్క్రీన్ సైజు లు అనుకుంటారు. కానీ కాదు. ఇప్పుడు అవేంటో తెలుసుకుందాం..
Video Advertisement
ఇదివరకు సినిమాలను ప్రొజెక్టర్స్ వేసేవారు. ఇప్పటికే అదే పద్ధతి అయినా.. ప్రస్తుతం వాడేవిడిజిటల్ ప్రొజెక్టర్లు. ఇది వరకు ఉన్న ప్రొజెక్టర్స్ లో రీల్స్ వేసి సినిమా రన్ చేసే వారు. ఆ రీల్స్ కి ఉన్న వెడల్పునే mm లతో కొలుస్తారు. మనకు తెలిసినవి రెండే అయినా వీటిలో చాలా రకాలు ఉంటాయి. 8mm , 16mm , 35mm , 70mm . వీటిలో థియేటర్లలో ఎక్కువగా వాడేవి 35mm , 70mm .
వీటిలో 35mm రీల్స్ అయితే తక్కువ దూరం మాత్రమే ప్రాజెక్ట్ అవుతాయి. అందుకే వాటిని చిన్న స్క్రీన్ ల మీద వేసేవారు. అలాగే 70mm రీల్స్ అయితే ఎక్కువ దూరం వస్తాయి, అలాగే వాటికి చాలా క్లారిటీ ఉంటుంది. అందుకే వీటిని ఐ మాక్స్ వంటి వాటిలో వాడతారు. వీటి ఆధారంగానే చిన్న స్క్రీన్ లు, పెద్ద స్క్రీన్ లు అనడం మొదలు పెట్టారు.
అలాగే ఫిలిం స్ట్రిప్ లో ఉన్న హోల్స్ ని కూడా కౌంట్ చేసి ఆ ఫిలిం థిక్ నెస్ కౌంట్ చేసేవారు. 35 mm స్ట్రిప్‌లో 8 చిల్లులు ఉన్నాయని (దీనిని 8p / 35 mm ఫిల్మ్ అని కూడా పిలుస్తారు) అయితే 70 mm స్ట్రిప్‌లో 15 చిల్లులు ఉంటాయి.
అయితే గత కొంత కాలంగా 70 mm స్ట్రిప్స్ వినియోగం పెరుగుతోంది. కానీ బడ్జెట్ పరిమితులకు లోబడి చాలా మంది థియేటర్ల యజమానులు ఇప్పటికీ 35 mm ఫిల్మ్ లనే వాడుతున్నారు.
End of Article