“అందుకే అతను చనిపోయాడు..!” అంటూ… “ఉదయ్ కిరణ్”పై దిల్ సినిమా నటుడి కామెంట్స్..!

“అందుకే అతను చనిపోయాడు..!” అంటూ… “ఉదయ్ కిరణ్”పై దిల్ సినిమా నటుడి కామెంట్స్..!

by Megha Varna

Ads

లవర్ బాయ్ గా ఉదయ్ కిరణ్ టాలీవుడ్ లో పాపులర్ అయ్యారు. ఒకప్పుడు ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. నిజానికి అతి తక్కువ కాలంలోనే ఇండస్ట్రీ లో పాపులర్ అయిన నటుల్లో ఉదయ్ కిరణ్ కూడా ఒకరు. కానీ చివరికి సూసైడ్ చేసుకునే పరిస్థితి ఏర్పడింది.

Video Advertisement

అయితే చనిపోయి చాలా కాలం అయినా సరే ఉదయ్ కిరణ్ కి సంబంధించి ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. అయితే ఉదయ్ కిరణ్ గురించి తాజాగా దిల్ రమేష్ ఇంటర్వ్యూలో మాట్లాడడం జరిగింది.

దిల్ సినిమా లో పేరు పొందిన దిల్ రమేష్ ఉదయ్ కిరణ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఉదయ్ కిరణ్ చాలా ఫ్రెండ్లీగా ఉండే వారని రమేష్ తెలిపారు. ఉదయ్ కిరణ్ తో నువ్వు నేను సినిమాలో నటించానని ఆయన చెప్పారు. చనిపోయే దాకా మేమిద్దరం ఎంతో క్లోజ్ గా ఉన్నామని.. ఉదయ్ కిరణ్ చనిపోవడం బాధాకరమని అన్నారు.

అదే విధంగా శ్రీహరి మరణం కూడా నన్ను బాధించిందని చెప్పారు రమేష్ చెప్పారు. ఏదో ఒక రోజు మంచి పొజిషన్ కి వస్తానని శ్రీహరి తన తో చెప్పే వారని దిల్ రమేష్ అన్నారు. పైగా ఉదయ్ కిరణ్ హీరో అయినప్పటికీ కూడా అతను బాగా కలిసిపోయే వారని.. ఒక స్నేహితుడిలా వుండే వారని.. ఎప్పుడూ కూడా సరదాగానే ఉండే వారని చెప్పారు.

కాస్త మనస్తాపానికి గురైన ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నారని ఆయన అన్నారు. మామూలుగా అయితే పెద్ద హీరోలతో కాస్త రిజర్వ్డ్ గా ఉంటామని దిల్ రమేష్ అన్నారు. కానీ ఇతర హీరోలతో మాత్రం కొంచెం ఫ్రెండ్లీ గా ఉంటామని అన్నారు.


End of Article

You may also like