Ads
సాధారణంగా అమ్మాయిలకు అర్ధరాత్రి సమయాల్లో బయట తిరగాలంటే భయం ఉంటుంది. ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతాయో అన్న ఉద్దేశ్యంతో చాలా మంది అమ్మాయిలు అసలు బయటకి రావడానికే ఇష్టపడరు. అయితే, రాజస్థాన్ లోని ఓ ప్రాంతంలో మాత్రం పరిస్థితి డిఫరెంట్ గా ఉంటుంది.
Video Advertisement
రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో ఓ ప్రత్యేకమైన పండుగ జరుగుతుంది. ఈ పండుగని దింగా గవర్ మేళా అని పిలుస్తారు. ఇక్కడ ఈ పండుగ రోజున పురుషులు రాత్రి సమయంలో బయటకు రాకూడదు.
ఒకవేళ వచ్చారంటే వారికి పనిష్మెంట్ తప్పదు. ఆరోజు రాత్రి సమయాల్లో స్త్రీలు బెత్తం పట్టుకుని తిరుగుతూ ఉంటారు. బయట ఎవరైనా పురుషులు కనిపిస్తే వారిని బెత్తంతో కొడుతూ ఉంటారు. కేవలం మహిళలకు ప్రత్యేకతను ఇస్తూ ఈ ప్రత్యేక జాతరను నిర్వహిస్తున్నారు. రాత్రంతా స్త్రీలు బెత్తం పట్టుకుని తిరుగుతూ ఉంటారు. కనిపించిన పురుషుల్ని కొట్టేస్తూ ఉంటారు. అయితే.. వారు తెలియని వారైనా సరే.. బెత్తం పట్టుకుని కొట్టేస్తూ ఉంటారు.
మరో విశేషం ఏంటంటే.. ఎవరూ దానిని చెడుగా భావించారు. స్త్రీ పురుషుల మధ్య ప్రేమకు చిహ్నంగానే ఈ జాతరని నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఈ జాతారని నిర్వహించడానికి ముందే 16 రోజుల పాటు పూజలను నిర్వహిస్తారు. వాటిని దింగ గవర్ పూజలు అని పిలుస్తారు. పూజ ప్రారంభం అవడానికి ముందే మహిళలు గోడలపై గవర్ చిత్రాలను వేస్తారు. శివుడు, చంద్రుడు, గణేష్, ఎలుక, సూర్యుడు వంటి చిత్రాలను గోడలపై చిత్రీకరిస్తారు.
16 సంఖ్యకు చాలా ప్రాముఖ్యత ఇస్తారు. 16 మంది స్త్రీలు కలిసి 16 రోజుల పాటు పూజలు చేస్తారు. పూజ ముగిసాక రట్జగను జరుపుతారు. ఆ రోజు రాత్రే దింగ గవర్ జాతరను నిర్వహిస్తారు. మహిళలంతా ముసుగులు ధరించి బెత్తం పట్టుకుని తిరుగుతూ ఉంటారు. రాత్రివేళ రోడ్డుపై తిరిగే పురుషులను కొడుతూ ఉంటారు.
End of Article