Ads
డైరెక్టర్ మహి వి. రాఘవ్ ఆనందో బ్రహ్మ, యాత్ర సినిమాలకు దర్శకత్వం వహించారు. అతను దర్శకుడిగానే కాకుండా నిర్మాత, క్రియేటర్ గా కూడా వ్యవహరించారు. ఇటీవల నిర్మాతగా సైతాన్ అనే చిత్రాన్ని రూపొందించారు. ఆ మధ్యన రిలీజ్ అయిన ‘సేవ్ ద టైగర్స్’ అనే వెబ్ సిరీస్ కు క్రియేటర్ గా వ్యవహరించారు.
Video Advertisement
సేవ్ ద టైగర్స్ వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. మహి వి. రాఘవ్ ‘యాత్ర 2’ మూవీని తెరకెక్కించబోతున్నారు. ఈ క్రమంలో ‘యాత్ర 2’ మోషన్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. అయితే డైరెక్టర్ మహి వి. రాఘవ్ కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఆ వీడియో పై నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
మహి.వి.రాఘవ్ సినీ దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా పలు సినిమాలకు పని చేశారు. విలేజ్ లో వినాయకుడు, కుదిరితే కప్పు కాఫీ సినిమాలకు సహ నిర్మాతగా చేశారు. పాఠశాల అనే మూవీ ద్వారా దర్శకత్వం ప్రారంభించాడు. ఆ తరువాత ఆనందో బ్రహ్మ, యాత్ర సినిమాలను తెరకెక్కించాడు. ప్రస్తుతం యాత్ర-2 మూవీకి దర్శకత్వం చేస్తున్నారు.
ఇది ఇలా ఉంటే మహి వి. రాఘవ్ పెళ్ళిళ్ళు విఫలం అవడం వెనుక ఉన్న కారణం గురించి ఒక ఇంటర్వ్యూలో తన అభిప్రాయాన్ని వెల్లడించారు. దానికి సంబంధించిన వీడియోను డార్క్ ఫేజ్ అనే ఇన్ స్టాగ్రామ్ పేజీలో షేర్ చేయడంతో దాని పై నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఆ వీడియోలో దర్శకుడు మహి వి. రాఘవ్ ఇలా చెప్పుకొచ్చాడు.
“ఒకప్పుడు ప్రపంచ దేశాలు మన పెళ్ళిళ్ళ గురించి వివాహ బంధం గురించి గొప్పగా మాట్లాడుకునే వారు.
కానీ ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకున్న జంటలలో సగానికి పైగా విడిపోతున్నారు. దానికి కారణం వుమెన్ ఎంపవర్మెంట్. ఎడ్యుకేషన్, ఎకనామిక్ ఇండిపెండెన్స్ ఇలా అన్నిట్లో వారికి ఛాయిస్ లు ఎక్కువగా ఉండడం, స్త్రీలు పురుషుల కన్నా వేగంగా ఎవాల్వ్ అవుతారు. విముక్తి పొందిన స్త్రీ ఎల్లప్పుడూ సమాజానికి ప్రమాదకరం. విముక్తి పొందిన స్త్రీని హ్యాండిల్ చేయడం చాలా కష్టం ఇది నా అభిప్రాయం మాత్రమే” అని చెప్పుకొచ్చారు. ఈ వీడియో పై పలువురు కామెంట్స్ చేశారు. ఈ పోస్ట్ కి ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే అని చెప్తూ మహి వి. రాఘవ్ కూడా కామెంట్ చేసారు.
watch video :
https://www.instagram.com/reel/Cr_alCxshLm/?igshid=NTc4MTIwNjQ2YQ%3D%3D
Also Read: ఆ స్టార్ హీరో మోసగాడు అంటూ.. ప్రొడ్యూసర్ షాకింగ్ కామెంట్స్..!
End of Article