Ads
ప్రతి ఒక్కరికి కూడా కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి. వాటి ప్రకారం నడుచుకుంటే ఖచ్చితంగా మంచి జరుగుతుందని ఫెయిల్యూర్ ఉండదని అనుకుంటూ ఉంటారు. నిజానికి అవి బాగా వర్కౌట్ అవుతాయి కూడా. మనకి ఎదుటి వాళ్ల సెంటిమెంట్స్ చూడటానికి చాలా సింపుల్ గా కనపడతాయి.
Video Advertisement
అదేంటి ఇక్కడ కూర్చుంటే పని అయిపోతుందా..?, ఆ నెంబర్ సెలెక్ట్ చేసుకుంటే తిరుగు ఉండదా అని మనం నవ్వుకోవచ్చు. కానీ వాళ్లకు మాత్రం బాగా వర్కవుట్ అవుతుంది.
అందుకే ఎంతటి ఇబ్బంది వచ్చినా సెంటిమెంట్ ని కొందరు పక్కన పెట్టరు. ఎక్కువగా ఏదైనా నచ్చిన వస్తువుని వాళ్ళ వెంట తీసుకెళ్లడం లేదంటే నెంబర్ లను ఎంపిక చేసుకోవాల్సి వచ్చినప్పుడు లక్కీ నెంబర్ ను ఎంపిక చేసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. కొందరికి రంగు విషయంపై కూడా సెంటిమెంట్ ఉంటుంది.
అదృష్టాన్ని తీసుకొచ్చే కలర్ బట్టలని వేసుకోవడం వల్ల పనిలో ఎలాంటి ఇబ్బంది, ఆటంకం కలగకుండా పని సాఫీగా జరిగిపోతుంది అని చాలా మంది నమ్ముతుంటారు. డైరక్టర్ కొరటాల శివ కి కూడా ఒక సెంటిమెంట్ ఉంది. దానిని ఫాలో అయితే అదృష్టం కలిసి వస్తుందని.. ఫెయిల్యూర్ ఉండదని అతను నమ్ముతారు. కొరటాల శివ గురించి కొత్తగా పరిచయం చెయ్యక్కర్లేదు. తన దర్శకత్వంలో మంచి సినిమాలను తీసుకువచ్చి విజయాన్ని అందుకుంటున్నారు.
స్టార్ హీరోలకు కూడా మంచి హిట్ సినిమాలను ఇస్తున్నారు కొరటాల శివ. అయితే కొరటాల శివ కి ఉన్న సెంటిమెంట్ ఏమిటంటే.. రంగు సెంటిమెంట్. కొరటాల శివకు బ్రౌన్ కలర్ అంటే చాలా ఇష్టం. అందుకనే ఆయన సినిమాల్లో చాలా వరకు హీరోలంతా క్లైమాక్స్ లో బ్రౌన్ కలర్ చొక్కాని వేసుకుంటారు. ఈ కలర్ వల్ల తనకు బాగా కలిసొస్తుందని అతని నమ్మకం. ప్రస్తుతం కొరటాల శివ ఆచార్య సినిమా కి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తను సెంటిమెంట్ ని ఈ హీరోల పైన కూడా ప్రయోగించారు.
End of Article