Home Filmy Adda “అందులో తప్పేముంది..?” అంటూ… “సర్కారు వారి పాట”లోని ఆ సీన్‌పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ పరశురామ్..!

“అందులో తప్పేముంది..?” అంటూ… “సర్కారు వారి పాట”లోని ఆ సీన్‌పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ పరశురామ్..!

by Anudeep

మొదటి షో లో ప్రేక్షకుల అంచనాలు భారీగా ఉన్నా, కొన్ని కారణాల వల్ల సర్కారు వారి పాట సినిమా కి రాను రాను ప్రేక్షకులలో నెగిటివ్ టాక్ వెలువడింది.

ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ తో ఎంటర్టైనింగ్ గా ఉన్నా, సెకండ్ హాఫ్ మాత్రం మరి సాగదీసినట్లు ఉందని, కథకు బలమైన కథనాలు ఏమీ లేవని ప్రేక్షకుల నుంచి అభిప్రాయాలు వెల్లడయ్యాయి.

Sarkaru vari pata block buster poster

ఇక సర్కారు వారి పాట చిత్రంలో కొన్ని సీన్స్ పై ఇప్పటికే సోషల్ మీడియాలో మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. నిర్మాతలు బ్లాక్ బస్టర్ అంటూ పోస్టర్ రిలీజ్ చేస్తూ ఉంటే, ఈ సినిమా పెద్ద డిజాస్టర్  సోషల్ మీడియాలో ట్రేండింగ్ అవుతోంది. నెగిటివ్ టాక్ కి కలెక్షన్ల కి తేడా లేకుండా సర్కారు వారి పాట చిత్రం ముందుకుపోతుంది.

Sarkaru vari pata image

ఇక విషయం ఇలా ఉంటే  మహేష్ బాబు, కీర్తి సురేష్ కి మధ్య జరిగిన కొన్ని సన్నివేశాలు ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. ఒక సన్నివేశంలో మహేష్ బాబు కీర్తి సురేష్ మీద కాలు వేసుకుని పడుకుంటాడు.  ఇప్పటికీ ఈ సన్నివేశంపై ప్రేక్షకులు అభ్యంతరాన్ని వెల్లడిస్తున్నారు. మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ కి ఇలాంటి సన్నివేశం అవసరమా… అని , ఈ సన్నివేశం ఆయన స్థాయిని దిగజార్చేలా ఉంది అని విమర్శలు చేస్తున్నారు.

Director parasuram

ఇప్పుడు ఇదే విమర్శపై దర్శకుడు పరశురామ్ స్పందిస్తూ ఒక క్లారిటీ ఇచ్చారు. ఈ సన్నివేశంలో వల్గారిటీ ఉందనిపిస్తే మహేష్ బాబు వద్దనే వారు.  ఈ సీన్స్ లో  అసభ్యకరంగా ఉండడానికి ఏముంది. ఇందులో తల్లీబిడ్డల ప్రేమ ఉందని, తల్లి ఒడిలో నిద్ర పోయే ఒక బిడ్డ అనిపిస్తోందని విమర్శలకు చెక్ పెడుతూ ఒక క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు పరుశురామ్.  దర్శకుడు పరశురరామ్ ఇచ్చిన క్లారిటీ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రేండింగ్ గా మారింది.

You may also like