స్టార్ డైరెక్టర్ “వి.వి.వినాయక్” గుర్తున్నారా..? ఇప్పుడు ఇలా అయిపోయారు ఏంటి..?

స్టార్ డైరెక్టర్ “వి.వి.వినాయక్” గుర్తున్నారా..? ఇప్పుడు ఇలా అయిపోయారు ఏంటి..?

by Anudeep

Ads

ఆది, చెన్నకేశవ రెడ్డి, దిల్ , ఠాగూర్ వంటి బ్లాక్ బస్టర్స్ తీసిన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వి. వి. వినాయక్. ఈ మధ్య వినాయక్ డైరెక్షన్ లో చెప్పుకోదగ్గ సినిమాలు ఏం రాలేదు. ఆ మధ్య చిరంజీవి హీరోగా వచ్చిన ఖైదీ నెం. 150 హిట్ అయినా, ఆ తర్వాత వచ్చిన  ఇంటలిజెంట్ అంతగా ఆకట్టుకోలేదు.

Video Advertisement

ఆ తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ తో ప్రభాస్ ఛత్రపతిని హిందీలో రీమేక్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ సినిమాను  దర్శకధీరుడు రాజమౌళి లాంచ్ చేశారు కానీ షూటింగ్ ఎంత వరకు వచ్చింది ఏంటీ అనే అప్డేట్స్ మాత్రం లేవు. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ జరుగుతోంది అనే వార్తలు వస్తున్నాయి. ఇందులో హీరోయిన్ రెజీనా కసాండ్రా నటిస్తున్నట్టు సమాచారం. ఆ మధ్య చిరంజీవి రీమేక్ చేస్తున్న లూసిఫర్ లో డైరెక్టర్ వి వి వినాయక్ కూడా నటిస్తున్నాడు అని అనౌన్స్ చేశారు.

అయితే ఇప్పుడు సడన్ గా వి వి వినాయక జిమ్ లో వర్క్ ఔట్స్ చేసి సన్నబడిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వినాయక్ ఇలా వర్క్ ఔట్స్ చేసి సన్నబడ్డది తను హీరోగా చేస్తున్న ‘సీనయ్య’ సినిమా కోసమా, లేక వినాయక్ ఇంకో కొత్త సినిమాను కూడా ఒకే చేసి ఇలా సన్నబడ్డారో తెలీదు కానీ ఒక్కసారిగా అన్ని కేజీల బరువు తగ్గడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు వివి వినాయక్ హార్డ్ వర్క్ ని మెచ్చుకుంటున్నారు. చాలా కొత్తగా కనిపిస్తున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫోటోలని వివి వినాయక్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

ఈ వర్క్ ఔట్స్ మరో కొత్త సినిమా కోసమే అయితే.. ఇక ముందు డైరెక్టర్ వివి వినాయక్ ని, హీరో వివి వినాయక్ కూడా అవుతాడేమో చూడాలి. వినాయక్ టైటిల్ రోల్ లో నటిస్తున్న సీనయ్య సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మాతగా ఎన్ నరసింహారావు దర్శకత్వంలో రూపొందిస్తున్నారు.


End of Article

You may also like