అతను కరోనాను జయించాడు…డిశ్చార్జ్ అవుతూ కిటికీ అద్దంపై ఏం రాసారో చూడండి!

అతను కరోనాను జయించాడు…డిశ్చార్జ్ అవుతూ కిటికీ అద్దంపై ఏం రాసారో చూడండి!

by Anudeep

Ads

యువరాజ్ సింగ్ క్యాన్సర్ నుండి కోలుకుని విదేశాల నుండి వచ్చాక ఒక విషయం షేర్ చేసుకున్నాడు.. మన దగ్గర ఏదైనా ఆరోగ్య సమస్య రాగానే, దాని ద్వారా ఎంతమంది చనిపోయారు, అసలది ఎంత భయంకరమైన రోగమో లాంటి మాటలే ఎక్కువ వినిపిస్తాయి. కాని నేను అమెరికాలో ట్రీట్మెంట్ కి వెళ్లినప్పుడు అక్కడ డాక్టర్ నన్ను హగ్ చేసుకుని ఓహ్,అదేమంత పెద్ద విషయం కాదు అన్నట్టుగా మాట్లాడి మనసుని తేలిక చేశారు..అని తన అనుభవాన్ని పంచుకున్నాడు.. ఈ కరోనా పేషెంట్ కథ చదువుతుంటే  యువరాజ్ మాటలు ఎందుకో గుర్తొచ్చాయి.

Video Advertisement

అమెరికాలో ఇప్పటికే రెండు లక్షలమందికి పై చిలుకు కరోనా బారిన పడ్డారు, ఆరువేల పైనే మరణాలు సంభవించాయి. అయినా కూడా అక్కడ పేషెంట్స్ ధైర్యం కోల్పోకుండా ఉండడంలో డాక్టర్లు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.. కేవలం మందుల ద్వారానే కాదు , వారి మాటల ద్వారా పేషెంట్స్ లో మనోధైర్యాన్ని పెంచుతున్నారు..అమెరికాలోని ఒహియోకు చెందిన 38ఏళ్ల నిక్ బ్రాన్ కొద్ది రోజుల క్రితం కరోనా బారినపడ్డాడు. కుటుంబ సభ్యులు అతడ్ని దగ్గరలోని ఉన్న హాస్పిటల్‌ చేర్పించారు . నిక్ పరిస్థితి విషమంగా మారడంతో ఐసియులో పెట్టి చికిత్స చేశారు.

రోజురోజుకి నిక్ పరిస్థితి మరింత విషమంగా మారుతుంది తప్ప మెరుగుపడట్లేదు.దాంతో ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తున్నప్పటికి , నిక్ బతకడం కష్టమే అని తేల్చేశారు. అతడి భార్యకి అదే విషయం చెప్పారు.ఆరోగ్య పరిస్థతి క్షీణిస్తుండటంతో నిక్ బ్రాన్ మానసికంగా కృంగిపోయాడు. నిక్ పరిస్థితి చూసిన డాక్టర్లు వెంటనే ఒక ఐడియా అనుకుని దాన్ని అమలు చేశారు. నిక్ ఉన్న రూంలో రకరకాల కొటేశన్లు రాసి అతికించారు. ‘మేము నిన్ను ఆరోగ్యంగా ఇంటికి పంపిస్తాము’ అంటూ  డాక్టర్లు రాసిన కొటేషన్లు అతనిలో మనోధైర్యాన్ని నింపాయి.

నిక్ ధైర్యంతో పాటు డాక్టర్ల ట్రీట్మెంట్ కంటిన్యూ అవడంతో కొద్దిరోజుల్లోనే నిక్ కరోనా ని జయించాడు. దాంతో నిక్ నిశ్చింతగా ఇంటికి వెళ్లొచ్చని డిశ్చార్జ్ చేస్థామని డాక్టర్స్ చెప్పారు. హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్లే రోజు రానే వచ్చింది. ఇంటికి వెళ్లేరోజు నిక్ తన రూంలోని  కిటికి అద్దంపై  ఒక కొటేషన్ రాసి వెళ్లాడు.. ‘మీ శ్రమ ఫలించడం వల్లే నేను చిరునవ్వుతో ఇంటికి వెళ్తున్నాను. మీకు సేవ చేసే అవకాశం నాకు రాకపోవచ్చు. మీకు దేవుడి అశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి’ అని నిక్ డాక్టర్లను రాక్ స్టార్స్ గా అభివర్ణించాడు. నిక్ వాక్యలకి డాక్టర్లు సంతోషపడగా.. నిక్ రాసిన వ్యాఖ్యల ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతోంది.


End of Article

You may also like