Ads
హైదరాబాద్ నగరం బెల్లా విస్టా ప్యాలెస్ (ప్రస్తుతం అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా) లోని ఒక సొరంగం లేదా బంకర్ గురించిన చర్చ మరోసారి వెలుగులోకి వచ్చింది. చారిత్రాత్మక చార్మినార్‌ను గోల్కొండతో అనుసంధానించే సొరంగం గురించి ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు ధృవీకరించబడలేదు. కానీ.. ఈ విషయమై జరుగుతున్నా చర్చలు, కధనాలు మరోసారి వేగం పుంజుకున్నాయి.
Video Advertisement
బెల్లా విస్టా బంకర్ కేవలం కథ మాత్రమే కాదు. అది వాస్తవం. నగరానికి చెందిన ఫోటోగ్రాఫర్ మరియు వారసత్వ ఔత్సాహికుడు మొహమ్మద్ హబీబ్-ఉర్-రెహమాన్ ఈ నిర్మాణం యొక్క ఫోటోలతో దీనిని ధృవీకరించారు. దీనికి ప్రిన్స్ అజామ్ జా టన్నెల్ అని పిలిచే బోర్డు ఉంది. మరోవైపు ఫేస్ బుక్ వంటి మాధ్యమాలలో జరుగుతున్న చర్చలను బట్టి ఇది రెండవ ప్రపంచ యుద్ధంలో రాయల్స్ నిర్మించిన బంకర్ కావచ్చు అని తెలుస్తోంది. బహుశా వైమానిక దాడుల నుండి తప్పించుకోవడానికి ఇది ఏర్పడి ఉండవచ్చు. హబీబ్-ఉర్-రెహ్మాన్ దీనిని ఒక సొరంగం అని పేర్కొన్నారు. కానీ, వాస్తవానికి ఇది ఒక బంకర్.
End of Article