అప్పుడు చెత్త అమ్ముకున్న నటి… ఇప్పుడు లక్షల్లో సంపాదిస్తోంది..! ఈమె గురించి తెలిస్తే హాట్సాఫ్ అనాల్సిందే..!

అప్పుడు చెత్త అమ్ముకున్న నటి… ఇప్పుడు లక్షల్లో సంపాదిస్తోంది..! ఈమె గురించి తెలిస్తే హాట్సాఫ్ అనాల్సిందే..!

by Harika

Ads

ఆత్మవిశ్వాసం ఉంటే మనిషి ఎంత ఎత్తుకైనా ఎదుగుతుంది అనటానికి వీలువెత్తు నిదర్శనం ఈ నటి. అడిగినదానికి లొంగకపోతే కెరియర్ నాశనం చేస్తామని బెదిరించినా వణికిపోలేదు, చేతిలో చిల్లి గవ్వలేకపోయినా చిన్నా చితకా పనులు చేసింది. చివరికి చెత్త ఏరుకొని రూపాయి రూపాయి కూడబెట్టింది. ఈరోజు లక్షలు సంపాదిస్తుంది. ఆమె మరెవరో కాదు ప్రముఖ బుల్లితెర నటి దివ్యాంక త్రిపాఠి. ఈమె యాంకర్ గా తన కెరియర్ ని మొదలుపెట్టింది. తర్వాత 2005 లో మిస్ భోపాల్ గా కిరీటం అందుకుంది.

Video Advertisement

బనూ మే తేరి దుల్హన్ సీరియల్ తో క్లిక్ అయింది. ఎన్నో అవార్డులు అందుకుంది. ఇంక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పనిలేదు అనుకున్న సమయంలో మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. ఛాన్సులు కోసం ఆఫీసుల చుట్టూ తిరగవలసిన పరిస్థితి వచ్చింది. నిత్యవసరాలు, ఈఎంఐ లు ఇలా అన్నింటికి డబ్బులు అవసరమయ్యాయి. అందుకోసం ఏం చేయటానికైనా సిద్ధపడింది దివ్యాంక. పైగా తనకి పెంపుడు కుక్క ఉంది, చిన్న చిన్న పనులు చేసి 2000 నుంచి 5000 వరకూ వచ్చిన కిరణా సామాను తెచ్చుకోవచ్చు అనుకుంది.

divyanka tripathi struggles

చిన్న పాత్రలు ఇచ్చినా సరే చేస్తానంటూ డైరెక్టర్ లని వేడుకుంది. అట్టముక్కలను, టూత్ పేస్ట్ డబ్బాలను సేకరించి అమ్ముకుంది. ఒక డబ్బా కి ఒక రూపాయి ఇచ్చేవాళ్లట. అలా రోజు చెత్తను సేకరించి దాన్ని అమ్మి డబ్బు సంపాదించింది. అంతకుముందు దాచుకున్న డబ్బుతో ప్రతినెలా ఈఎంఐ లు కట్టింది. సరిగ్గా అదే సమయంలో తనకి రాత్రికి వస్తానంటే మంచి ఛాన్స్ ఇస్తామంటూ ఆఫర్ వచ్చిందట.

divyanka tripathi struggles

అయితే అలా అడ్డదారులు తొక్కి సంపాదించే బదులు సొంతంగా సంపాదించుకోవడమే మంచిది అనుకుంది. తర్వాత ఏహే మొహబ్బతే ధారవాహికలో డాక్టర్ ఇషిత అయ్యర్ గా ప్రధాన పాత్ర పోషించి ప్రేక్షకులకు దగ్గర అయింది. ఈ సీరియల్ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో దివ్యాంక ఇప్పుడు ఒక్కొక్క ఎపిసోడ్కి లక్ష నుంచి 1,50000 సంపాదించే స్థాయికి ఎదిగింది.2017లో ఫోర్బ్స్ సెలబ్రిటీ 100 జాబితాలో చోటు దక్కించుకున్న మొట్టమొదటి బుల్లితెరగా రికార్డులకు ఎక్కింది. నిజంగా ఇన్స్పిరేషనల్ జర్నీ ఈమెది.


End of Article

You may also like