DJ Tillu Review : యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా విడుదలైన “DJ టిల్లు” హిట్టా..? ఫట్టా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

DJ Tillu Review : యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా విడుదలైన “DJ టిల్లు” హిట్టా..? ఫట్టా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

by Mohana Priya

Ads

  • చిత్రం : DJ టిల్లు
  • నటీనటులు : సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి, ప్రిన్స్, బ్రహ్మాజీ, నర్రా శ్రీను.
  • నిర్మాత : సూర్యదేవర నాగ వంశీ
  • దర్శకత్వం : విమల్ కృష్ణ
  • సంగీతం : శ్రీ చరణ్ పాకాల
  • విడుదల తేదీ : ఫిబ్రవరి 12, 2021

Dj tillu movie review

Video Advertisement

స్టోరీ:

బాలగంగాధర్ తిలక్ అలియాస్ టిల్లు (సిద్దు జొన్నలగడ్డ) ఒక మిడిల్ క్లాస్ కుటుంబానికి చెందినవాడు. టిల్లు డీజేగా చేస్తూ ఉంటాడు. రాధిక (నేహా శెట్టి) ఒక సింగర్. అనుకోకుండా రాధిక తన బాయ్ ఫ్రెండ్ ని మర్డర్ చేసిన కేస్ లో ఇరుక్కుంటుంది. ఇందులో నుండి తనని బయట పడేయడానికి సహాయం కోసం టిల్లుని అడుగుతుంది. టిల్లు రాధికకి సహాయం చేశాడా? చివరికి వారిద్దరూ ఇబ్బందుల నుండి ఎలా బయట పడ్డారు? ఈ విషయాలన్నీ మీరు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

Dj tillu movie review

రివ్యూ:

సినిమా ఒక యూత్ ఫుల్ ఎంటర్టైనర్ అని మనకి ముందు నుండి చెప్తూనే ఉన్నారు. నిజంగానే ఈ సినిమా యూత్ ని దృష్టిలో పెట్టుకుని తీసినట్టు అనిపిస్తుంది. సినిమా స్టార్టింగ్ బాగుంది. కానీ సినిమా ముందుకు వెళ్లే కొద్దీ స్లోగా నడుస్తూ ఉంటుంది. స్క్రీన్ ప్లే బాగున్నా కూడా కథలో కొత్తదనం లేదు. దాంతో నెక్స్ట్ ఏమవుతుంది అనే ఆసక్తి పెద్దగా ఉండదు. కొన్ని సీన్స్ చాలా బాగున్నాయి. చాలా చోట్ల కామెడీ కూడా వర్కవుట్ అయ్యింది. ఇంక పర్ఫామెన్స్ విషయానికి వస్తే ఈ సినిమాకి మెయిన్ హైలైట్ మాత్రం సిద్దు.

Dj tillu movie review

సిద్దు ఎక్స్ప్రెషన్స్, డైలాగ్స్ చాలా నాచురల్ గా ఉన్నాయి. రాధికగా నేహా శెట్టి కూడా పర్వాలేదు. మిగిలిన పాత్రల్లో నటించిన ప్రిన్స్, నర్రా శ్రీను, ప్రగతి, బ్రహ్మాజీ కూడా తమ పాత్రల పరిధి మేరకు బానే నటించారు. కానీ కొన్ని సీన్స్ మాత్రం కొంచెం వెరైటీగా, అసలు ఎందుకు పెట్టారు అన్నట్టు అనిపిస్తాయి. సంగీత దర్శకుడు శ్రీ చరణ్ పాకాల అందించిన సంగీతం కూడా బాగుంది.

ప్లస్ పాయింట్స్

  • సిద్దు
  • పాటలు
  • అక్కడక్కడ వర్కవుట్ అయిన కామెడీ

మైనస్ పాయింట్స్

  • గ్రిప్పింగ్ గా లేని స్టోరీ
  • సెకండ్ హాఫ్

రేటింగ్:

2.5/5

ట్యాగ్ లైన్:

స్టొరీ పాతదే అయినా కూడా టైం పాస్ కోసం సినిమా చూడాలి అనుకునే వాళ్ళకి డీజే టిల్లు ఒకసారి చూడగలిగేే యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా నిలుస్తుంది.


End of Article

You may also like