Ads
ఈ టీవీ ప్రేక్షకులందరికీ మల్లెమాల వారి బాండ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ లో ఉన్న టీం లీడర్లు అందరూ కూడా మల్లెమాల వారితో బాండ్ లో ఉంటారు. మరి వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వడం కూడా వాళ్లకు తప్పనిసరి.
Video Advertisement
ఒకవేళ పొరపాటున బాండ్ లో ఉన్నవారు మల్లెమాల ని వదిలి వెళ్లాలి అంటే పది లక్షల రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. జబర్దస్త్ షో రెగ్యులర్ గా చూసే వాళ్లకి అవినాష్ ఇష్యూ గుర్తుండే ఉంటుంది.గతంలో అవినాష్ బాండ్ బ్రేక్ చేసినందుకు గాను ఏకంగా 10 లక్షల రూపాయలు చెల్లించాడు.
అప్పటినుంచి ఈ మల్లెమాల వారి బాండ్ గురించి బాగా డిస్కషన్ జరుగుతోంది. జబర్దస్త్ లో వచ్చే ప్రతి ఒక్కరూ బ్యాండ్ లో ఉంటారు, ముఖ్యంగా టీం లీడర్ అయితే బాండ్ పేపర్ లో సంతకం కూడా పెట్టాలి. అయితే ప్రస్తుతం జబర్దస్త్ లో రోహిణి కూడా ఒక టీం కి లీడర్ గా ఉంటుంది. కానీ ఎందుకో తెలియదు కానీ ఆమెపై మాత్రం బాండ్ వర్తించడం లేదు. సాధారణంగా జబర్దస్త్ కంటెస్టెంట్ బాండ్ లో ఉంటే మరి ఇతర ఏ ఛానల్ కార్యక్రమాలలో పాల్గొనకూడదు.
కానీ రోహిణి మాత్రం స్టార్ మా లో ప్రసారం అయ్యే పలు కార్యక్రమాలకు మరియు జీ తెలుగులో ప్రసారమవుతున్న డాన్స్ కార్యక్రమాలకు హ్యాపీగా హాజరవుతోంది. రోహిణి కి మాత్రమే ఎందుకు ఈ అవకాశం అనేది ప్రస్తుతం పెద్ద ప్రశ్నగా మారింది. లేడీ అయిన కారణంగా మల్లెమాలవారు ఒప్పందం రాయించుకోలేదేమో అంటూ కొందరు అభిప్రాయ పడుతున్నారు. కానీ కొందరు మాత్రం ఆమెకు స్పెషల్ గా ఏవో చిన్న చిన్న మినహాయింపులు ఇచ్చి ఉంటారు అని భావిస్తున్నారు.
ఈమధ్య కొంతకాలం క్రితం రోహిణి ఈటీవీ మల్లెమాల నీ వదిలేసినట్లుగానే పుకార్లు షికారు చేశాయి. కానీ ఇప్పటికీ ఆమె జబర్దస్త్ లో ఓ టీమ్ లీడర్ గానే కొనసాగుతూ ఉంది. అయితే కొందరు మాత్రం రోహిణి విషయంలో మల్లెమాల వారు చూసి చూడనట్లుగా ఉండడంపై తమ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కానీ కొందరు మాత్రం ఇదే పద్ధతి అందరి కంటెస్టెంట్స్ కి ఫాలో అయితే బాగుంటుంది అంటున్నారు. కానీ అది మల్లెమాల వారి పాలసీకి విరుద్ధం కనుక రోహిణికి తప్ప మరెవ్వరికీ వారు ఈ బాండ్లు మినహాయింపులు ఇచ్చేలా లేరు.
End of Article