ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరూ బట్టలని ఉతకడానికి వాషింగ్ మిషన్ ని వాడుతున్నారు. మీ ఇంట్లో కూడా వాషింగ్ మిషన్ ఉందా..? మీరు సరిగ్గా వాడుతున్నారా..? లేదా..? అయితే తప్పకుండా మీరు సరిగ్గా వాడుతున్నారా లేదా అనేది ఇలా తెలుసుకోండి. ఎక్కువ శ్రమ పడక్కర్లేదు అని టైం ని సేవ్ చేసుకోవచ్చు అని చాలా మంది వాషింగ్ మిషన్లని కొనుగోలు చేస్తున్నారు. అయితే వాషింగ్ మిషన్ వాడేటప్పుడు చేసే కొన్ని తప్పులు వల్ల మిషన్ పాడవుతుంది. లేదు అంటే బట్టలు చిరిగిపోవడం లాంటి సమస్యలు వస్తాయి. అలాంటి సమస్యలు మీకు కలగకుండా ఉండాలంటే తప్పక మీరు ఇవి చూడాల్సిందే.

Video Advertisement

#1. వాషింగ్ మిషన్ ని వాడేటప్పుడు దాని యొక్క సామర్థ్యం కంటే ఎక్కువ బట్టల్ని అందులో వెయ్యద్దు. కేవలం ఎంత లోడ్ అయితే మిషన్ ఉతకగలదో అన్నే వేయండి. అప్పుడు మిషన్ పాడవకుండా ఉంటుంది.

#2. అదేవిధంగా వాషింగ్ మిషన్ లో బట్టలు ఉతికేటప్పుడు మీ యొక్క దుస్తులను విభజించండి. అంటే వైట్ కలర్ దుస్తులు, కొత్త బట్టలు ఇలా మీరు సెపరేట్ చేసి ఉతికితే మంచిది. ఇలా చేయడం వల్ల దుస్తులు ఎక్కువ కాలం మన్నుతాయి.

#3. అలానే కొత్త బట్టలని, తెల్ల బట్టలతో పాటు ఉతికితే కొత్త బట్టలుకి ఉండే రంగు తెల్లబట్టలకి అంటుకుపోతుంది. దీని వల్ల మీ తెల్ల బట్టలు పాడవుతాయి.

#4. మీ బట్టలు బాగా శుభ్రంగా ఉండాలంటే డైరెక్టుగా సర్ఫ్ ని వేసేయద్దు. ఆ సర్ఫ్ లో కొద్దిగా నీళ్ళు కలిపి ఆ నీళ్లని మిషన్లో వేయండి.

#5. మిషన్ డ్రమ్ పాడవకుండా ఉండాలంటే మీ దుస్తులకు ఉండే జిప్స్ ని మూసేసి అప్పుడు ఉతకండి. అలా చేస్తే మెషిన్ డ్రమ్ దెబ్బతినకుండా ఉంటుంది. ఇలా మీరు ఈ జాగ్రత్తలు తీసుకుంటే కచ్చితంగా మెషిన్ ఎక్కువకాలం పాడవకుండా ఉంటుంది. అలానే దుస్తులు కూడా ఎక్కువ కాలం మన్నుతాయి.