Ads
ఎలాంటి సంబంధాలు అయినా, అన్యోయన్యంగా ఉండాలి అంటే కావలసింది, ప్రేమ, కేరింగ్, బాధ్యత, అర్దం చేసుకునే మనస్తత్వం, సర్దుకుపోవడం ఇలా ఎన్నో చెపుతుంటారు. కానీ వీటన్నింటికీ మించి ముఖ్యమైనది మాట. మనం కోపంలో ఉన్నా, బాధలో ఉన్నా, చికాకులో ఉన్నా మన మాట అదుపులో ఉండాలి. ‘
Video Advertisement
ఏమి మాట్లాడినా గౌరవంగా అనిపించాలి కానీ, కించ పరిచేలా, వ్యక్తిత్వాన్ని దూషించేల ఉండకూడదని గుర్తుంచుకోవాలి. మన పెద్దలు అంటుంటారు కదా మాట వెనక్కి తీసుకోలేమని అది ఇక్కడ కూడా వర్తిస్తుంది. నిజానికి ఎన్నో ప్రేమ జంటలు, దంపతులు విడిపోవడానికి లేదా వారి మధ్య ప్రేమ ఆప్యాయతలు తగ్గిపోవడానికి ఇలాంటి మాటలే ముఖ్య కారణం. అందులో మరీ ముఖ్యంగా అనకూడని మాటలు ఏంటంటే…
1. వెళ్ళు ఎవరిని అయినా చూసుకో, నన్ను వొదిలేయి
ఈ మాట అన్నప్పుడు, మీ పార్టనర్ చాలా బాధ పడతారు. తమని చాలా చులకనగా చూస్తున్నారని భావిస్తారు. అంటే అంత మాట ఎలా అంటారు?? నేను అలా కనిపిస్తున్నానా అనుకుంటూ కృంగిపోతారు.
2. నీకన్నా నా పాత లవర్ చాలా బెటర్
ఇలా మాట్లాడినప్పుడు అంటే తన పాత లవర్ ఇంకా గుర్తున్నారా?? ఇంకా వీళ్ళు టచ్ లో ఉన్నారేమో అనే అనుమాలను వ్యక్తం అవుతుంటాయి. అంతే కాదు నేను చేసింది ఏది గుర్తు లేదా అని బాధ పడతారు.
3. నేను తప్ప నీతో ఇంకెవ్వరూ ఉండకూడదు
అలా అన్నప్పుడు మొదట్లో కొంత ప్రేమగా ఫీల్ అయినా తరువాత, మరి ఇంత పొస్సేసివ్ గా ఉన్నారేంటి?? అంటే నా మీద నమ్మకం లేదా అనే ఆలోచన వస్తుంది.
4. అదంత పెద్ద విషయం ఏమీ కాదు, నువ్వు అంత సున్నితంగా ఉంటే ఎలా?
ఇలా అన్నప్పుడు నా ఫీలింగ్స్ కి లెక్క లేదా. నా బాధ అర్దం కావట్లేదా?? అంత ఈజీగా ఎలా చెప్పేస్తారు?? తినని ప్రేమించి తప్పు చేశాను… నాకు తోడు ఉంటారనుకున్నా కానీ ఇలా నన్నే అర్దం చేసుకోవట్లేదు అనే భావన కలుగుతుంది.
5. నువ్వు నన్ను వొదిలేయ్యాలి అనుకుంటున్నావా??
అలా అన్నప్పుడు నా ప్రేమ మీద నమ్మకం లేదా అనే ఆలోచన వస్తుంది? వొడిలెయ్యడానికే అయితే ఇదంతా ఎందుకు చేస్తాను అని అనుకుంటారు? అంతే కాదు తరువాత ప్రేమగా దగ్గరకి రావాలి అన్నా కూడా, వొడిలేస్తను అనే భావన ఉన్నాక మనస్పూర్తిగా రాలేరు.
6. నువ్వు నిజంగా నన్ను ప్రేమించి ఉంటే, కచ్చితంగా ఆ పని చేస్తావు..
అన్నిటిలో ముఖ్యంగా మాట్లాడే తప్పుడు పదం ఇదే. ప్రతీ చిన్న దానికి నా మీద ప్రేమ ఉంటే చెయ్యి అని అడిగితే అది బలవంతం అవుతుంది. ఉదాహరణకి ముద్దు కావాలి అన్నా, హగ్ కావాలి అన్నా ఇవ్వడానికి ఇష్టం లేదంటే అర్దం ప్రేమ లేదని కాదు.. కేవలం ఆ పనులు చెయ్యాలని అప్పుడే లేదని అర్థం. అది అర్థం చేసుకోకుండా ప్రేముంటే ముద్దు ఇవ్వు అని అడగటం, ప్రేమగా ఇవ్వలేరు. ఇష్ట పడిన వ్యక్తిని కూడా చేదరించుకునే అవకాశం ఉంది.
ఇలా ఎంతో మంది ప్రేమ జంటలు విడిపోవడానికి సగం కారణం వాళ్ళు మాట్లాడే మాటలే. కాబట్టి ఇప్పటి నుండి అయినా మీ ప్రియుడు, లేదా ప్రేయసిని గౌరవిస్తూ, ప్రేమించండి. అనవసరమైన మాటలతో ప్రేమని దూరం చేసుకోకండి.
End of Article