సినిమా రిలీజ్ అయ్యాక మీరెప్పుడైనా ఇది గమనిస్తారా..? ఇంతోటిదానికి అమలాపాల్ ఇంత హర్ట్ అయిందా..? అసలేమైందంటే..?

సినిమా రిలీజ్ అయ్యాక మీరెప్పుడైనా ఇది గమనిస్తారా..? ఇంతోటిదానికి అమలాపాల్ ఇంత హర్ట్ అయిందా..? అసలేమైందంటే..?

by Anudeep

Ads

ఏదైనా కొత్త సినిమా రిలీజ్ అవుతోంది అంటే మనందరికీ ఎగ్జైట్ మెంట్ ఉండడం కామన్. కానీ ఆ సినిమా కి సంబంధించిన పేర్లు చూడడం లో కూడా మనం అంతే ఎగ్జైట్ మెంట్ ఫీల్ అవుతామా..? లేదు కదా. సినిమా ప్రారంభం అవ్వడానికి ముందే సినిమా యాక్టర్స్ పేర్లతో పాటు డైరెక్టర్, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు, మ్యూజిక్ డైరెక్టర్స్, ఇలా సినిమా కి పని చేసిన వారందరి పేర్లు పడుతూ ఉంటాయి కదా. ఇవి చాలా మంది పట్టించుకోరు. కానీ అమలాపాల్ మాత్రం ఈ విషయం లో హర్ట్ అయ్యారట.

Video Advertisement

kudi edamaite

ఇటీవలే ఆమె నటించిన “కుడి ఎడమైతే” వెబ్ సిరీస్ ఆహ లో ప్రసారం అవుతోంది. ఈ వెబ్ సిరీస్ ఇప్పటికే మంచి టాక్ కూడా తెచ్చుకుంది. అయితే.. ఈ వెబ్ సిరీస్ కి ట్రైలర్ ని రెండు సార్లు రిలీజ్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే.. మొదట ట్రైలర్ రిలీజ్ అయినపుడు మొదట రాహుల్ విజయ్ పేరు పడిందట. ఈ వెబ్ సిరీస్ లో అమలా పాల్ ప్రధాన పాత్ర పోషించారు.

kudi edamaite 2

ఆమె కాకుండా.. రాహుల్ విజయ్ కూడా ఈ వెబ్ సిరీస్ లో ఓ కీలక పాత్రని పోషించారు. ఐతే.. పేర్లు పడడం లో ముందు రాహుల్ విజయ్ నేమ్ రావడం తో అమల పాల్ హర్ట్ అయ్యారని, నిర్మాతలతో కూడా చర్చించారని ఇండస్ట్రీ లో టాక్ నడుస్తోంది. అందుకే మరో సారి ట్రైలర్ ని రిలీజ్ చేసి.. అమలా పాల్ పేరు ముందు పడేలా పెట్టారట. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటోంది.


End of Article

You may also like