“చంటి” సినిమా లో చిన్నప్పటి వెంకటేష్, మీనా లు ఎవరో, ఇప్పుడేమి చేస్తున్నారో తెలుసా..?

“చంటి” సినిమా లో చిన్నప్పటి వెంకటేష్, మీనా లు ఎవరో, ఇప్పుడేమి చేస్తున్నారో తెలుసా..?

by Anudeep

Ads

1992 లో వెంకటేష్, మీనా హీరో, హీరోయిన్లు గా నటించిన “చంటి” సినిమా గుర్తుందా..? ఈ సినిమా అప్పట్లోనే ఆల్ టైం రికార్డు సృష్టించింది. దాదాపు నలభై థియేటర్లలో ఈ సినిమా వందరోజులు ఆడి రికార్డులు సృష్టించింది. వెంకటేష్, మీనాల కెరీర్ ఈ సినిమా ఓ మైలు రాయి గా నిలిచింది. ఈ సినిమా అప్పట్లో ఇంటిల్లిపాది ని అలరించి పెద్ద విజయమే సాధించింది.

Video Advertisement

chanti

తమిళం లో వచ్చిన చిన్న తంబీ సినిమాకి రీమేక్ గా ఈ సినిమా ను రూపొందించారు. ఈ సినిమా కి రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించారు. ఈ సినిమాని తెలుగు నేటివిటీ కి తగ్గట్లుగా రూపొందించారు. “చంటి” సినిమా కి సంగీత దర్శకుడు ఇళయరాజా సంగీతాన్ని సమకూర్చారు.

ఈ సినిమా హిందీ లో కూడా రిలీజ్ అయింది. “అనారి” పేరుతొ 1993 లో హిందీ లో కూడా విడుదల చేసారు. హిందీ సినిమా లో వెంకీ మామ తో పాటు కరిష్మా కపూర్ ప్రధాన పాత్ర పోషించారు. తెలుగు లో మీనా, వెంకటేష్ లతో పాటు నాజర్, బ్రహ్మానందం కూడా కీలక పాత్రలను పోషించి ఆకట్టుకున్నారు.

ajay raghavendra 2

ఆరోజుల్లోనే నలభై థియేటర్లలో వందరోజులు ఆడిన సినిమా గా “చంటి ” రికార్డులు సృష్టించింది. అయితే, ఈ సినిమాలో వెంకటేష్ చిన్న తనం లో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తున్నాడా..? అతని పేరు అజయ్ రాఘవేంద్ర. “చంటి” సినిమాలో నటించిన తరువాత, అజయ్ రాఘవేంద్ర హీరో గా రాణించాలనుకున్నాడు. “బాపు బొమ్మకు పెళ్ళంటా” అనే సినిమాలో హీరో గా నటించాడు. కానీ, ఆ తరువాత అవకాశాలు అంతగా రాకపోవడం తో సినిమాలకు దూరం గా ఉన్నాడు. అలాగే.. చిన్నప్పటి మీనా గా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ పేరు మౌనిక. ఆమె కూడా పలు సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి.. పెళ్లి తరువాత.. ప్రస్తుతం సినిమాలకు దూరం గా వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది.


End of Article

You may also like