మెగాస్టార్ చిరంజీవి, సురేఖల పెళ్లి ఎలా జరిగిందో మీకు తెలుసా..?

మెగాస్టార్ చిరంజీవి, సురేఖల పెళ్లి ఎలా జరిగిందో మీకు తెలుసా..?

by Megha Varna

Ads

మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టాలీవుడ్ లో ప్రముఖ స్టార్ హీరోలలో చిరంజీవి కూడా ఒకరు. సినిమాల పై ఇష్టంతో చిరంజీవి మొదట ఎన్నో కష్టాలు పడి ఆ తర్వాత నెమ్మదిగా ఎదుగుతూ… కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు.

Video Advertisement

ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ని చిరంజీవి సొంతం చేసుకున్నారు. నాటి హీరోలకి కూడా చిరంజీవి ఆదర్శం. నటనతో, డాన్స్ తో అందర్నీ ఫిదా చేసేస్తారు చిరంజీవి.

అయితే చిరంజీవికి సురేఖతో 1980, ఫిబ్రవరీ 20 న వివాహం అయింది. అప్పట్లో చిరంజీవిని ఇచ్చి తన కూతురు సురేఖ తో వివాహం చేయాలా వద్దా అని ఎన్నో అనుమానాలు పెట్టుకున్నారు అల్లు రామలింగయ్య. కానీ వీటన్నింటినీ పక్కన పెట్టేసి చిరంజీవి కష్ట పడిన తీరును చూసి పెద్ద హీరో అవుతారని చెప్పేవారట.

పైగా చిరంజీవిని ఎంతగానో ప్రోత్సహించే వారు. అప్పటి విషయాలను చిరంజీవి ఇంటర్వ్యూలో చెప్పారు. అతని పెళ్లి సమయానికి చిరు ‘తాతయ్య ప్రేమ లీలలు’ అనే సినిమా చేస్తున్నారట. ఆ చిత్రంలో నూతన ప్రసాద్ కి చిరంజీవికి చాలా సీన్లు ఉన్నాయి. అయితే నూతన ప్రసాద్ అప్పట్లో చాలా బిజీగా ఉండేవారు.

ఆయన డేట్స్ కోసం చిరంజీవి ఏకంగా పెళ్లి కూడా వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. నిర్మాత మాత్రం షూటింగ్ ని వాయిదా వేసి పెళ్లికి గ్యాప్ ఇచ్చారు. ఇక పెళ్ళి పీటల మీద కూడా ఒక హాస్య సంఘటన జరిగింది. పెళ్లి పీటల మీద చిరంజీవి కూర్చున్నాక చొక్కా చిరిగిపోయింది. బట్టలు మార్చుకోవచ్చు కదా అని సురేఖ చిరంజీవికి చెప్తే బట్టలు చిరిగి పోతే తాళిని కట్టలేనా అని అలానే చిరంజీవి తాళి కట్టేశారు. ఇలా ఆనాటి విషయాలను చిరంజీవి షేర్ చేసుకున్నారు.


End of Article

You may also like