Ads
ఐదేళ్ల వైవాహిక జీవితం.. పదేళ్ల ప్రేమ కథ.. అకస్మాత్తుగా జరిగిన ఓ విషాద తుది ప్రయాణానికి వెనుక ఒక తెలియని విషయం దాగి ఉంది.. అదేంటంటే.. గుజరాత్ లోని జునాగఢ్‌కు చెందిన 30 ఏళ్ల శ్రీనాథ్ సోలంకి ఫోటోగ్రాఫర్. ఆయన భార్య మోనిక.
Video Advertisement
మోనిక ప్రసవనంతరం, తల్లీబిడ్డ ఇద్దరు చనిపోయారు. పుట్టిన వెంటనే మరణించిన పసికందుకు భాజా భజంత్రీలతో, సంగీతంతో తుది వీడ్కోలు పలికారు. ఆమె కళ్లను కూడా దానం చేశారు. “ఒకసారి నేను నా భార్య సరదాగా మాట్లాడుకుంటూ, నేను ఈ లోకాన్ని వదిలి వెళ్ళాక నువ్వు ఏడుస్తావని అన్నాను. ఆ మాటలు విని, నీ కంటే ముందు నేను చనిపోతాను.
మన పెళ్ళికి బ్యాండు మేళంతో వచ్చిన మాదిరిగానే నన్ను సాగనంపు” అని మోనిక చెప్పారని శ్రీనాథ్ ఓ ఛానల్ కు తెలిపారు. “మోనిక మరణం తర్వాత నాకు ఆమె మాటలు గుర్తొచ్చాయి. అందుకే, నా భార్యను బ్యాండు మేళంతో స్మశానానికి తీసుకుని వెళ్లాలని నిర్ణయించుకున్నాను. ఆమెతో పాటు పురిట్లోనే చనిపోయిన పసికందును కూడా తీసుకుని వెళ్లాను. ఇలా చేయాలని నా కుటుంబంతో కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాను.
మోనిక అంతిమ యాత్రలో వేలమంది పాల్గొన్నారు” అని శ్రీనాథ్ తెలిపారు. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నేను వెడ్డింగ్ ఫోటోగ్రఫీ చేస్తాను. నేను మోనిక కజిన్ పెళ్ళికి ఫొటోగ్రఫీ అసైన్ మెంట్‌కు వెళ్లాను. అక్కడే మా ఇద్దరికీ పరిచయమైంది. కొన్ని రోజులు మాట్లాడిన తర్వాత వివాహ ప్రతిపాదన వచ్చింది. 2017లో మా పెళ్లి జరిగింది అని శ్రీనాథ్ ఆయన ప్రేమ, పెళ్లి గురించి వివరించారు.
పెళ్ళైన ఐదేళ్ల తర్వాత మేము పిల్లల్ని కనాలని అనుకున్నాం. మేము అనుకున్నట్లే మాకు అమ్మాయి పుట్టింది. కానీ, పుట్టిన కొన్ని క్షణాలకే కళ్ళు మూసింది అని శ్రీనాథ్ చెప్పారు. గత గురువారం సుమారు 12.30 నిమిషాలకు మా మామగారు మోనిక ఆరోగ్యం బాలేదని ఫోన్ చేసి చెప్పారు. మేం వెంటనే వెరావల్ బయలుదేరి వెళ్లాం. దారిలోనే మోనిక ప్రాణాలతో లేదనే సమాచారం అందింది అని చెప్పారు.
మోనికకు రక్త పోటు పెరిగి బ్రెయిన్ స్ట్రోక్‌కు దారి తీసింది. కడుపులో బిడ్డను కాపాడాలని డాక్టర్ ప్రయత్నించారు, కానీ, పుట్టిన మూణ్నాలుగు నిమిషాలకు పసి కందు కూడా ఇన్ఫెక్షన్ సోకి చనిపోయింది. మోనిక కళ్ళను దానం చేశారు. బేసానలో రక్త దాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 37 మంది రక్త దానం చేశారు” అని శ్రీనాథ్ తెలిపారు.
End of Article