Ads
విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన దృశ్యం-2 చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. గురువారం దృశ్యం-2 సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. దృశ్యం-1 సినిమా కి రెండవ భాగం గా ఈ చిత్రం వచ్చింది. ఈ చిత్రంలో సరిత పాత్ర చేసి బాగా మెప్పించింది ఆ నటి.
Video Advertisement
ఒక పక్క సరిత భర్త వేధింపులకు గురై నలిగిపోతూ ఉంటుంది. మరోపక్క అండర్ కవర్ పోలీస్ గా కూడా ఆమె నటించడం జరుగుతుంది. అయితే ఈమె ఎవరు అనేది చాలా మందికి తెలియదు. మరి దృశ్యం-2 లో సరిత పాత్ర చేసిన ఆమె ఎవరో ఇప్పుడు చూద్దాం.
సరిత పాత్ర చేసి మెప్పించిన ఆమె పేరు సుజా వరుణి. ఆమె ఒక పెద్దింటి కోడలు. ఎంతో కష్టపడి పైకి వచ్చింది. సొంతంగా పేరు కూడా సంపాదించుకుంది. తమిళ్ బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా ఈమె జర్నీ మొదలుపెట్టి… ఈరోజు మంచి నటిగా ఈమె ఎదిగింది. సుజా వరుణి దృశ్యం-2 లో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది. ఈమె అసలు పేరు సుజాత. తమిళ్ నటుడు శివాజీ గణేషన్ మనవడు శివాజీ దేవ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.
ఈమె కంటే కూడా అతను ఐదేళ్లు చిన్నవాడు. అయినా వీళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకోవడం జరిగింది. వీళ్ళకి ఒక కొడుకు కూడా. కోలీవుడ్ సినిమాతో తెరంగ్రేటం చేసింది. తెలుగులో ఆలీబాబా ఒక్కడే దొంగ, గుండెల్లో గోదారి, దూసుకెళ్తా, నాగవల్లి సినిమాలలో చిన్న పాత్రలు చేసింది. దృశ్యం-2 లో మాత్రం ఈమె పాత్ర చాలా అద్భుతంగా ఉంది. ఈ చిత్రంతో ఈమెకు అవకాశాలు పెరిగేటట్లు కనబడుతున్నాయి.
End of Article