Ads
అ, ఎవరు, నగరం వంటి వైవిధ్యమైన చిత్రాలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేమైన గుర్తింపు తెచ్చుకుంది రెజీనా కసాండ్ర. ఎస్ ఎమ్ ఎస్ (శివ మనసులో శ్రుతి) ఫిల్మ్ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రెజీనా టాప్ హీరోయిన్ గా మాత్రం ఎదగలేకపోయింది. ప్రస్తుతం సినిమాలతో పాటు వెబ్ సిరీస్ కూడా చేస్తూ బిజీగా ఉంది. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఆచార్య’ చిత్రంలో ‘సానా కష్టం వచ్చిందే మందాకిని’ అనే ఐటెం సాంగ్ కూడా చేసింది రేజీనా.
Video Advertisement
తాజాగా అలీతో సరదాగా ప్రోగ్రాం పాల్గొన్న రెజీనా తన చిన్న నాటి సంగతులను పంచుకుంది. ఈ క్రమంలోనే తాను ప్రెగ్నెంట్ అని చెప్పి అందరికి షాక్ ఇచ్చింది. రెజీనా కసాండ్ర నిజంగా పెళ్లి కాకుండానే గర్భవతి అయిందా? అని అంతా అవాక్కయ్యారు. అయితే రెజీనా ప్రెగ్నెంట్ అని చెప్పింది ఓ పని కోసమేనని ఆ ఇంటర్వ్యూలో స్పష్టం చేసింది.
ఒకరోజు రాత్రి పదకొండు గంటల సమయంలో తనకు స్వీట్ తినాలిపించిదట. దాంతో ఓ స్వీట్ షాప్ వద్దకు వెళ్లింది. అక్కడ వాళ్లు క్లోజ్ చేస్తున్న టైంలో తనకు స్వీట్ కావాలని అడిగింది. దానికి సదరు షాపు నిర్వాహకులు ఇవ్వడం కుదరదని చెప్పగా, తాను ప్రెగ్నెంట్ అని రెజీనా కసాండ్ర అబద్ధం చెప్పిందట. అలా ‘మిస్టీ దోయ్ స్వీట్’ కోసం రెజీనా తను గర్భవతినని చెప్పిందన్న మాట.
ఈ విషయం తెలుసుకుని నెటిజన్లు ‘రెజీనా ఇంత అల్లరి పిల్లనా?’ అని సరదాగా కామెంట్ చేస్తున్నారు. మేము కూడా చిన్నప్పుడు అబద్దాలు ఆడాము కానీ ఈ రేంజ్ లో మాత్రం కాదు బాబోయ్ అంటున్నారు నెటిజన్లు. ప్రస్తుతం రెజీనా తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో నటిస్తోంది. వైవిధ్యభరితమైన పాత్రలు పోషించేందుకు తాను ఎప్పుడు సిద్ధమేనని రెజీనా చెప్తోంది. మెగా హీరో సాయి ధరమ్ తేజ్, యంగ్ హీరో సందీప్ కిషన్ తన కు ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్సని చెప్పింది రెజీనా.
End of Article