Ads
దర్శకధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘స్టూడెంట్ నెంబర్ వన్’ మూవీతో డైరెక్టర్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన జక్కన్న, తక్కువ కాలంలోనే భారీ విజయాలు సాధిస్తూ, తెలుగు ఇండస్ట్రీలో ప్లాప్ ఎరుగని దర్శకుడిగా నిలిచారు.
Video Advertisement
ఆర్ఆర్ఆర్ మూవీతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పి, తెలుగు సినిమా ఆస్కార్ కలను సాకారం చేసాడు. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ కురిపించే రాజమౌళి సినిమాలు నిర్మాతలకు ఎన్నో లాభాలను తెచ్చాయి. కానీ ఒక సినిమా మాత్రం నష్టాలను తెచ్చిందంట. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
రాజమౌళి సీరియల్ దర్శకుడిగా కెరీర్ ను మొదలు పెట్టారు. స్టూడెంట్ నెంబర్ వన్ సినీ దర్శకుడిగా మారారు. రెండవ చిత్రం సింహాద్రితో ఇండస్ట్రీ హిట్ ఇచ్చారు. మగధీర మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని భారతీయ సినీ ప్రేక్షకుల అందరిని తెలుగు ఇండస్ట్రీ వైపు దృష్టి పెట్టేలా చేశాడు. ఇక బాహుబలితో భారతీయ సినీ ఇండస్ట్రీ రికార్డులన్నిటిని తిరగ రాయడమే కాక, అంతర్జాతీయ ప్రేక్షకులు సైతంఆకట్టుకున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీతో ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా సత్తా చాటారు. అందని ద్రాక్షగా ఉన్న ఆస్కార్ ను తెలుగు ఇండస్ట్రీకి అందించారు.
ప్రస్తుతం రాజమౌళి నెక్స్ట్ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆడియెన్స్ హాలీవుడ్ సినీ ప్రముఖులు సైతం ఎదురుచూస్తుండడం విశేషం. ఇది ఇలా ఉంటే ప్లాప్ ఎరుగని రాజమౌళి సినిమాలు నిర్మాతలకు పెట్టినదానికన్న రెండు మూడు రెట్లు ఎక్కువ లాభాలను కురిపిస్తాయి. కానీ ఆయన తీసిన సినిమాలలో ఒకటి మాత్రం కమర్షియల్ గా విజయం సాధించిన కూడా కలెక్షన్స్ పరంగా బిగ్గెస్ట్ హిట్ అందుకోలేదని అంటున్నారు. అదే నితిన్ నటించిన ‘సై’ మూవీ. ఈ మూవీ ఆడియెన్స్ ని ఆకట్టుకుంది.
దాదాపు ఎనిమిది కోట్ల బడ్జెట్ తో ‘సై’ మూవీని నిర్మించారట. అయితే ఈ మూవీ లాంగ్ రన్ లో పన్నెండు కోట్లను మాత్రమే కలెక్ట్ చేసిందట. కమర్షియల్ గా ఈ మూవీ విజయం సాధించినా, కొన్ని ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్ లకు అనుకున్న రేంజ్ లో లాభాలు రాలేదని, కొద్దిపాటి నష్టాలు వచ్చాయని కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.
End of Article