Ads
తాజాగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించిన కిషయం తెలిసిందే. బాలీవుడ్ లో 80 లలోనే డిస్కో డ్యాన్సర్ గా ఏలిన మిథున్ చక్రవర్తికి పద్మభూషణ్ అవార్డును కేంద్రం ప్రకటించింది. ఈ క్రమంలో మిథున్ చక్రవర్తికి ప్రముఖులు, అభిమానులు అభినందనల చెబుతున్నారు.
Video Advertisement
ఒకప్పుడు నక్సలైట్ అయిన మిథున్ చక్రవర్తి, తొలి సినిమాతోనే జాతీయ ఉత్తమ నటుడి అవార్డ్ అందుకుని, స్టార్ హీరోగా ఎలా మారారో? ఆ తరువాత రాజకీయాలలో ఎప్పుడు అడుగుపెట్టారో ఇప్పుడ చూద్దాం..
మిథున్ చక్రవర్తి అసలు పేరు గౌరంగ చక్రవర్తి. ఆయన 1950లో జూన్ 16న పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో బెంగాలీ దిగువ మధ్యతరగతి హిందూ ఫ్యామిలిలో జన్మించారు. అతని తల్లిదండ్రులు బసంత కుమార్ చక్రవర్తి, శాంతి రాణి చక్రవర్తి దంపతులకు. అతను ఓరియంటల్ సెమినరీలో చదువుకున్నాడు మరియు తరువాత తన బీఎస్సి కోల్‌కతాలోని స్కాటిష్ చర్చి కళాశాల చేశాడు. ఆ తరువాత, పూణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుండి పట్టభద్రుడయ్యాడు.
బెంగాల్ లో నక్సలైట్ ఉద్యమం మొదలైన తరువాత ఇతర వేలాది బెంగాలీ యువకుల లాగానే, మిథున్ కూడా 1960ల చివరలో నక్సల్ పోరాటంలోకి వెళ్లారు. కోల్‌కతాలో నక్సలైట్ పోరాటం జరిగే టైమ్ లో చారు మజుందార్‌తో పనిచేశారు. అయితే నక్సలైట్ల పై పోలీసుల అణిచివేత వల్ల మిథున్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. ఆయన నక్సలైట్ గా మరడంతో ఆయన ఫ్యామిలీ ఆందోళనకు గురైంది. అదే సమయంలో మిధున్ సోదరుడు యాక్సిడెంట్ లో మరణించడంతో తిరిగి ఇంటికి వచ్చిన మిథున్ మళ్ళీ అటు వైపు చూడలేదు.
ఆ తరువాత సినిమాలలో నటించాలని ప్రయత్నాలు మొదలుపెట్టాడు. కానీ అవకాశాలు అంత తేలికగా రాలేదు. ఒక్క పూట భోజనం కూడా దొరికేది కాదు. కొరయోగ్రాఫర్ హెలెన్ దగ్గర చేరారు. స్టేజ్ పై డ్యాన్స్ చేసేవాడు. తన డ్యాన్స్ చూసి అయినా సినిమాలో ఛాన్స్ ఇస్తారేమో అని. ఎన్ని రోజులు 1976లో మృగయా మూవీతో మిథున్ చక్రవర్తి బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీతో ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును అందుకుని సంచలనం సృష్టించారు. ఆ తరువాత పలు సినిమాలలో నటించినా, 1982లో వచ్చిన ‘డిస్కో డాన్సర్’ మూవీతో సూపర్‌స్టార్‌డమ్ అందుకున్నాడు.
దేశంలోనే తొలి వందకోట్ల మూవీగా సంచలనం సృష్టించింది. ఈ మూవీతో ఇండియాలోనే కాకుండా రష్యాలో కూడా పాపులారిటీ పొందారు. డ్యాన్స్ స్టార్‌గా పేరు వచ్చింది. ఆ తరువాత ఎన్నో హిట్ సినిమాలు చేసి అగ్రహీరోగా మారారు. ఓ దశలో వరుసగా 33 సినిమాలు ఫ్లాప్ అయినా ఆయన స్టార్ డమ్ చెక్కచెదరలేదు. 1979లో నటి యోగీతా బాలిని వివాహం చేసుకున్నాడు. వీరికి నలుగురు పిల్లలు మిమోహ్, ఉష్మే చక్రవర్తి , నమషి చక్రవర్తి , దత్తపుత్రిక దిశాని చక్రవర్తి. రాజకీయాలలో ఎంట్రీ ఇచ్చిన మిథున్ ప్రస్తుతం బిజెపిలో కొనసాగుతున్నారు.
Also Read: రవితేజ భార్య పిల్లల్ని ఎప్పుడైనా చూసారా.? వైరల్ అవుతున్న ఫామిలీ ఫోటో.!
End of Article