“నా పేరు నందిని.. నాకు మొబైల్ లో” అంటూ “18 పేజెస్” పోస్టర్ లో అనుపమ రాసింది ఏంటో తెలుసా..?

“నా పేరు నందిని.. నాకు మొబైల్ లో” అంటూ “18 పేజెస్” పోస్టర్ లో అనుపమ రాసింది ఏంటో తెలుసా..?

by Anudeep

Ads

నేడు యాక్టర్ నిఖిల్ పుట్టినరోజు. ఈ సందర్భం గా ఆయన నటిస్తున్న “18 పేజెస్” సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు. ఈ సినిమా లో అనుపమ హీరోయిన్ గా నటిస్తున్నారు. తాజాగా విడుదల అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ లో హీరో నిఖిల్, హీరోయిన్ అనుపమ జంట గా కనిపిస్తున్నారు. హీరో నిఖిల్ కు కళ్ళకు గంతలు కట్టి ఉండగా… ఆ కళ్ళ గంతలపై అనుపమ ఎదో రాస్తూ కనిపిస్తున్నారు.

Video Advertisement

18 pages

దర్శకుడు సుకుమార్ నిఖిల్ పుట్టిన రోజు సందర్భం గా ఈ పోస్టర్ ను రివీల్ చేసారు. సుకుమార్ సినిమాలంటేనే చాలా భిన్నం గా ఉంటాయి. మరి ఈ లవ్ స్టోరీ ఏ విధం గా ఉండబోతోందో చూడాలి. పోస్టర్ చూస్తూనే కొంత ఆసక్తిని రేకెత్తించే విధం గా ఉంది. అల్లు అరవింద్ సమర్పణలో, పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం లో ఈ సినిమా రూపొందుతోంది.

18 pages 2

ఈరోజు ఉదయమే ఈ పోస్టర్ ను రిలీజ్ చేసారు. అయితే.. అప్పటినుంచి అనుపమ పాప నిఖిల్ కు కట్టిన కళ్ళ గంతలపై ఏమి రాస్తోందా..? అని చూస్తున్నారు. ప్రోపర్ గా జూమ్ చేసి చూస్తే.. అనుపమ ఏమి రాస్తోందో కనిపిస్తుంది. ఇంతకీ అనుపమ ఏమి రాస్తోందంటే..

నా పేరు నందిని.. నాకు మొబైల్ లో టైపు చేయడం కంటే.. ఇలా పేపర్ పై రాయడమే ఇష్టం.. టైప్ చేసే అక్షరాలకు ఎలాంటి ఎమోషన్లు ఉండవు.. ఎవరు రాసినా ఒకేలా ఉంటాయి.. కానీ రాసే ప్రతి అక్షరానికి ఒక ఫీలింగ్ ఉంటుంది.. దానిపైనే సంతోషం ఉంటుంది.. నాకెందుకో ఇలా చెప్పడమే ఇష్టం..” అని రాసింది.


End of Article

You may also like