“పక్కా కమర్షియల్” ను రిజెక్ట్ చేసిన… ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా..!?

“పక్కా కమర్షియల్” ను రిజెక్ట్ చేసిన… ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా..!?

by Anudeep

ఒక సీరియస్ ఇష్యూ ని కూడా సరదా చెప్పడం డైరెక్టర్ మారుతీ స్టైల్. ప్రతి రోజు పండగే సినిమా హిట్ తర్వాత శోభన్ సంతోష్ హీరోగా చేసిన మంచిరోజులు వచ్చాయి మూవీ పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.

Video Advertisement

అందుకే నెక్ట్ ప్రాజెక్ట్ కమర్షియల్ గా ఉండాలి అని పక్కా కమర్షియల్ అనే టైటిల్ పెట్టి హీరో మాచో స్టార్ గోపీచంద్, హీరోయిన్ రాశీఖన్నాతో  సినిమా తీసాడు మారుతీ.  అయితే ఈ సినిమాకు మొదటి హీరోగా మాస్ మహా రాజ్ రవితేజ ను అనుకున్నాడంటా మారుతీ. యూవీ క్రియేషన్స్, జీ2 పిక్చర్స్ దీన్ని ప్రొడ్యూస్ చేస్తున్నట్టు అప్పట్లో వార్తలు కూడా వినిపించాయి.

దీనికి లాయర్ సాబ్ అనే టైటిల్ ని కూడా అనుకున్నారంటా.. ఈ ప్రాజెక్ట్ వదులుకొని రవితేజ రమేష్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఖిలాడి లో నటించాడు. అటు హిందీ, ఇటు తెలుగులోను పెద్దగా వసూళ్లు రాబట్టలేదు ఖిలాడి. రవితేజ మారుతీ ప్రాజెక్ట్ రిజెక్ట్ చేయడానికి కారణం మాత్రం తెలీదు. దీనిపై మారుతీ కానీ, రవితేజ కానీ ఇప్పటి వరకు స్పందించలేదు. 

ప్రస్తుతం రవితేజ రామారావు ఆన్ డ్యూటీ విడుదలకు సిద్ధంగా ఉండగా, ధమాకా, టైగర్ నాగేశ్వరరావు, వాల్తేరు వీరయ్య వంటి సినిమాలతో రవితేజ బిజీగా ఉన్నాడు. ఒక వైపు మారుతీ సినిమాలతో పాటు ఈ మధ్య 3 రోజెస్ అనే ఓ వెబ్ సిరీస్ కి రైటర్ గా కూడా చేసాడు. తర్వాత మారుతీ డార్లింగ్ ప్రభాస్ తో సినిమా చేయనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.


You may also like