శోభన్ బాబు తన సినీ వారసుడిగా కొడుకుని ఎందుకు పరిచయం చేయలేదో తెలుసా..?

శోభన్ బాబు తన సినీ వారసుడిగా కొడుకుని ఎందుకు పరిచయం చేయలేదో తెలుసా..?

by Anudeep

Ads

నటభూషణ్ శోభన్ బాబు ఈ పేరు చెప్తేనే ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాలు గుర్తుకువస్తాయి. ఇద్దరు పెళ్ళాల ముద్దుల మొగుడు అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది శోభన్ బాబు. అందానికి నిలువెత్తు రూపం శోభన్ బాబు. అప్పటి తరంలో శోభన్ బాబు అంటే ఇష్టపడని మహిళా ప్రేక్షకులే లేరు.

Video Advertisement

టాలీవుడ్లో ఎన్నో చిత్రాలకుగాను కథానాయకుడిగా నటించిన సూపర్ హిట్స్ అందుకున్నారు. టాలీవుడ్ సోగ్గాడుగా పేరు తెచ్చుకున్న శోభన్ బాబు అసలు పేరు శోభనా చలపతిరావు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన శోభన్ బాబు గారు చదువుకునే రోజుల్లోనే సినిమాల మీద మక్కువతో స్టూడియోల చుట్టూ తిరుగుతూ, అవకాశాల కోసం ఎన్నో కష్టాలు పడ్డారు.

మొదటిలో చిన్న చిన్న పాత్రలో నటించి, ఆ తర్వాత అగ్ర స్థాయి హీరోగా తన రేంజ్ పెంచుకున్నారు. తెలుగు సినీ ఇండస్ట్రీకి నాలుగో స్తంభంగా నిలిచారు శోభన్ బాబు. ఒక వయస్సు వచ్చిన తర్వాత తన నటన పరిధి ఇంతవరకే అని చెబుతూ సినీ ఇండస్ట్రీకి రిటైర్మెంట్ ప్రకటించారు. ఆ తర్వాత ఏ చిత్రంలోనూ ఆయన కనిపించలేదు.

శోభన్ బాబు గారు తన కుటుంబానికి ఎంతో ప్రాముఖ్యతను ఇస్తారు. ఇంత అగ్రస్థాయి హీరో అయ్యుండి కూడా తన సినీ వారసునిగా కొడుకుని ఇండస్ట్రీకు పరిచయం చేయలేదు. ఎందుకంటే ఆయన తన కుమారుని హీరోగా చేయాలని ఎప్పుడూ భావించలేదు. దానికి కారణాలు కూడా ఎన్నో ఉన్నాయి.

చిత్రం చిన్నదైనా పెద్దదైనా ఒత్తిడి ఎక్కువ హీరోపైనే ఉంటుంది. నేను పడిన కష్టం, ఒత్తిడి నా కొడుకు అనుభవించకూడదు అని అన్నారట. అదేవిధంగా సినిమా విజయం, పరాజయానికి కూడా హీరో మీద ప్రభావం చూపిస్తుంది అని ఆయన అభిప్రాయం. ఒక సందర్భంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాజా రవీంద్ర, శోభన్ బాబు గారు తన కొడుకుని ఎందుకు హీరోగా చేయలేదు అనే విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో ద్వారా వెల్లడించారు.


End of Article

You may also like