నాగార్జున ‘ఆవిడా మా ఆవిడే’ మూవీలో హీరోయిన్‌ గుర్తుందా? ఇండస్ట్రీకి దూరమైన ఈ హీరోయిన్ ఇప్పుడు ఎక్కడ ఉందో తెలుసా?

నాగార్జున ‘ఆవిడా మా ఆవిడే’ మూవీలో హీరోయిన్‌ గుర్తుందా? ఇండస్ట్రీకి దూరమైన ఈ హీరోయిన్ ఇప్పుడు ఎక్కడ ఉందో తెలుసా?

by kavitha

Ads

అక్కినేని నాగార్జున సూపర్‌ హిట్‌ చిత్రాలలో ‘ఆవిడా మా ఆవిడే’ కూడా ఒకటి. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ చిత్రం ఆడియెన్స్ ని ఎంతో ఆకట్టుకుంది. ఈ చిత్రంలో ఇద్దరు భార్యల నడుమ నలిగే భర్త క్యారెక్టర్ లో నాగార్జున పండించిన హాస్యం అందరినీ నవ్విస్తుంది. ఈ మూవీలో నాగార్జున భార్యాలుగా ఇద్దరు కథానాయకలు నటించారు. వారిలో ఒకరు హీరోయిన్ టబు, మరొకరు హీరా రాజగోపాల్‌.

Video Advertisement

హీరోయిన్ టబు ఈ చిత్రంలో అందం, నటనతో ఆకట్టుకుంది. ఇక రెండో భార్య పాత్రలో నటించిన హీరా తన నటనతో ఆడియెన్స్ ని మెప్పించింది. తమిళనాడుకు చెందిన హీరా టాలీవుడ్ లో ‘పబ్లిక్‌ రౌడీ’ అనే చిత్రంతో అడుగు పెట్టింది. ఆ మూవీ తరువాత లిటిల్‌ సోల్జర్స్‌, దొంగల రాజ్యం, శ్రీకారం, చెలికాడు, ఆహ్వానం, అల్లుడుగారోచ్చారు, పెద్ద మనుషులు లాంటి చిత్రాలలో నటించింది. అంతపురం చిత్రంలో స్పెషల్‌ సాంగ్‌ లో అలరించింది.
Heera-Rajagopal3టాప్ డైరక్టర్ మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘దొంగ దొంగ’ చిత్రంతో  హీరాకు గుర్తింపు లభించింది. హీరా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీలో కూడా నటించి ఆకట్టుకుంది. ఆమె అన్ని భాషల్లో కలిపి దాదాపు యాబైకి పైగా చిత్రాలలో నటించింది. కమల్‌ హాసన్‌, మోహన్‌లాల్‌, అజిత్, ప్రశాంత్‌ లాంటి అగ్ర హీరోల పక్కన హీరోయిన్ గా నటించింది. అయితే హీరా హఠాత్తుగా సినిపరిశ్రమకి దూరమైంది.
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్‌, హీరా ప్రేమించుకున్నారని, కానీ ఆ ప్రేమ  వివాహం దాకా వెళ్లలేదనే ప్రచారాలు అప్పట్లో బాగా వినిపించాయి. అందువల్లనే హీరా ఇండస్ట్రీకి దూరం అయ్యిందని టాక్. అమెరికాకు వెళ్లి, అక్కడే సెటిల్ అయ్యిందంట. అయితే హీరో అజిత్‌తో లవ్ ఫెల్యూర్ అవడంతో ఇప్పటికీ ఆమె సింగిల్‌గానే ఉందని సమాచారం.  సామాజిక మధ్యమాలలో కూడా హీరాకు ఖాతా లేదు. Heera-RajagopalAlso Read: “నాని” కి అఫైర్… ఆ “హీరోయిన్” తో ప్రేమలో పడ్డారా..? ఈ వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడు..?


End of Article

You may also like