ఉమైర్ సంధు, ఈమధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. ఓవర్సీస్ సెన్సార్ మెంబర్, ఫిల్మ్ క్రిటిక్ గా పాపులర్ అయిన ఉమైర్ సంధు స్టార్ హీరోల సినిమాల రిలీజ్ కు ముందే వాటికి రివ్యూ ఇస్తూ ఫేమస్ అయ్యాడు. అయితే అతను ఇటీవల రివ్యూలే కాకుండా సినీ సెలెబ్రెటీస్ సీక్రెట్ ఎఫైర్స్ అంటూ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ ట్వీట్ లు చేయడం మొదలు పెట్టాడు. ఆయన చేసిన ట్వీట్ లు నార్త్, సౌత్ ఇండస్ట్రీలోనూ సంచలనంగా మారాయి.
Video Advertisement
గతంలో రామ్ చరణ్, ప్రియాంక చోప్రా, మహేష్ బాబు పూజ హెగ్డే, విజయ్ దేవరకొండ- కరణ్ జోహర్ ఇలా ఎంతో మంది సినీ తారల గురించి వివాదాస్పద ట్వీట్ లు చేశాడు. అయితే చాలామంది సెలెబ్రెటీస్ ఉమైర్ సంధు పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా, అతను తన ధోరణిని ఏ మాత్రం కూడా మార్చుకోవడం లేదు. ఉమైర్ సంధు తాజాగా టాలీవుడ్ హీరో నానికి, హీరోయిన్ కీర్తి సురేష్‌తో ఎఫైర్ ఉందంటూ వివాదస్పద ట్వీట్ చేశాడు.నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా తొలిసారి’నేను లోకల్’ అనే సినిమాలో నటించారు. ఆ తర్వాత వీరిద్దరు చేసిన చిత్రం ‘దసరా’. శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రంతో డైరెక్టర్ గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. మార్చి 30న పాన్ ఇండియా మూవీ గా రీలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. విడుదల అయిన 4 రోజుల్లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసింది. 5 రోజుల్లో 100 కోట్ల క్లబ్‌లో చోటు సంపాదించింది. అయితే ఈ చిత్రం చిత్రీకరణ సమయంలో నాని, కీర్తి సురేష్ ను ప్రేమించాడంట. తనకు వివాహం అయిన విషయాన్ని కూడా మరచి కీర్తి సురేష్ కు దగ్గరవ్వాలనుకున్నాడంట
కీర్తి సురేష్ నాని ఫీలింగ్స్ గమనించినప్పటికి తనకేం తెలియనట్లు సైలెంట్ గా ఉందంట. నాని పనులు అర్థమైనా, కీర్తి మాత్రం లిమిట్స్ దాటకుండా స్నేహంగా ఉందంట. ఈ విధంగా ఉమైర్ సంధు ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో లో హాట్ టాపిక్ అయ్యింది. ఉమైర్ సంధు ట్వీట్ లో ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు. నాని, కీర్తి సురేష్ ఫ్యాన్స్ ఉమైర్ సంధును విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. నువ్వు ఫేమస్ కావడం కోసం అందరికి ఎఫైర్ ఉందంటూ ట్వీట్ చేస్తావా అంటూ ఆగ్రహిస్తున్నారు.
Also Read: “కన్నడలో కెరీర్ మొదలు పెట్టిన ప్రశాంత్ నీల్ … టాలీవుడ్‌కి ఎందుకు వెళ్ళిపోయాడు.?” అనే ప్రశ్నకు… దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన నెటిజన్..!