Ads
2006 లో శేఖర్ కమ్ముల దర్శకుడిగా చేసిన చిత్రం గోదావరి. దర్శకుడిగా అతడికి అది మూడో సినిమా. సుమంత్ హీరో. ఆనంద్ సినిమాలో హీరోయిన్ కమలిని ముఖర్జీని ఇందులో కూడా పెట్టాడు శేఖర్ కమ్ముల. ఈ సినిమాలో చాలా వరకు గోదావరిలో.. పడవ లోనే చిత్రీకరించారు. ఈ సినిమా తో సుమంత్ కి మంచి నటుడిగా గుర్తింపు వచ్చింది. శేఖర్ కమ్ముల మేకింగ్, మ్యూజిక్ అంతా ఈ చిత్రానికి మెయిన్ అసెట్ గా మారాయి.
Video Advertisement
ఆధునిక భావాలున్న, ఆత్మాభిమానం ఉన్న అమ్మాయిగా కమిలిని ముఖర్జీ సీత పాత్రలో జీవించేసింది. హీరోగా, రాజకీయాల్లో చేరి మంచి చేయాలనుకున్న యువకుడు రామ్ పాత్రలో సుమంత్ చాలా బాగా నటించాడు. రామ్ చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోతే అమ్మమ్మ, మామయ్య దగ్గర పెరుగుతాడు. మరదలు రాజీ అంటే రాముకి అభిమానం. కానీ మేనల్లుడు ఉద్యోగం లేకుండా తిరుగుతున్నాడని అతనికి పిల్లనివ్వడానికి మేనమామ అంగీకరించడు. ఈ చిత్రం అంతా ఆ పెళ్లి చుట్టూ తిరుగుతుంది.
ఈ చిత్రం కమలిని ముఖర్జీ కి చెల్లెలిగా లలిత సింధూరి నటించింది. తన చలాకి నటనతో అక్కని అల్లరి పెట్టె చెల్లి గా లలిత ఆ చిత్రం లో నటించింది. సినిమాలో ఆమె కనిపించేది తక్కువ సమయమే అయినా అందర్నీ ఆకట్టుకుంది లలిత. ఆ తర్వాత ఆమె సినిమాలకు దూరం గా ఉంది. చిన్నప్పటి నుంచి కూచిపూడి నాట్యం లో ఆమెకు ప్రవేశం ఉంది. ఆమె ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాన్స్ లో పీహెచ్డి చేసింది.
సోషల్ మీడియా లో ఆక్టివ్ గా ఉండే లలిత సింధూరి ఎప్పటికప్పుడు తన ఫోటోలని పోస్ట్ చేస్తూ ఉంటారు. ప్రముఖ నాట్యకారిని అరుణ భిక్షు పర్యవేక్షణలో ఆమె తన పీహెచ్ది ని పూర్తి చేసారు. ఆమె ప్రస్తుతం డాన్స్ టీచర్ గా పని చేస్తున్నారు. అలాగే హైదరాబాద్ లోని గీతం యూనివర్సిటీ లో ఆమె డాన్స్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు.
End of Article