Ads
చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయి, ఒకపూట తింటే మరో పూట పస్తులు, చదువుకునే స్థితి లేని జీవితం. అటువంటి దుర్భుర స్థితిని అనుభవించిన ఒక యువకుడు ఇండియాలోనే అతి పెద్ద విమానయాన సంస్థను స్థాపించి, దేశంలోనే అత్యంత ధనవంతుడుగా పేరు గాంచాడు.
Video Advertisement
చిన్నప్పటి నుండే ‘నువ్వు ఏది చేస్తే అదే నిన్ను చేరుతుంది.. మంచి చేస్తే మంచే వస్తుంది’ అని తన తల్లి చెప్పే మాటలను వింటూ పెరిగిన ఆ వ్యక్తి, ఆర్ధిక నేరానికి పాల్పడి అరెస్ట్ అయ్యి, నేరస్థుల మధ్య జైలు జీవితం గడుపుతున్నారు. ఆ వ్యక్తి ఎవరో ఇప్పుడు చూద్దాం..
సాక్షి కథనం ప్రకారం…పైన కనిపిస్తున్న ఫోటోలో తెల్లని గడ్డంతో, సాధారణ బట్టలతో కనిపిస్తున్న వ్యక్తి. ఒకప్పుడు ఎయిర్ లైన్స్ రంగంలో రారాజులా కీర్తించబడిన పెద్ద బిజినెస్ మెన్. వేల కోట్లల్లో ఆస్తులు, వంద సంఖ్యలో విమానాలు ఉన్న ఆయన ప్రపంచ ధనవంతులలో ఒకరు. ఆ ప్రముఖ వ్యక్తి ఎవరో కాదు, జెట్ ఎయిర్‌వేస్ ఫౌండర్ నరేశ్ గోయల్. రూ.538.62 కోట్ల బ్యాంకు లోన్స్ ఎగవేత కేసులో జైలు పాలయ్యారు.
ప్రస్తుతం కరడు గట్టిన నేరస్థులు, గూండాలు మరియు షార్ప్‌షూటర్లతో కలిసి గోయల్ జైలు జీవితం గడుపుతున్నారు. మనీలాండరింగ్ కేసులో గత ఏడాది సెప్టెంబర్ 1న అరెస్ట్ అయిన, 4 నెలల నుండి ముంబై ఆర్థర్ రోడ్ ప్రిజన్ లో శిక్షను అనుభవిస్తున్నారు. గోయల్ స్పెషల్ కోర్టుకు హాజరవడం కోసం జైలు నుండి బయటకు రాగా, ఆ టైమ్ లో నేషనల్ మీడియా తీసిన ఫోటో ఇది. జనవరి 26న ప్రైవేట్ హాస్పటల్ వైద్యుల సూచనల మేరకు, తనని ప్రైవేట్ హాస్పటల్ లో వైద్య పరీక్షలు చేయించుకోవడానికి అనుమతించాలాని పిటిషన్‌లో కోరారు.
జెట్ ఎయిర్‌వేస్ కంపెనీ కెనరా బ్యాంకు నుండి 848.86 కోట్ల రూపాయల లోన్ తీసుకుంది. అందులో కొంత చెల్లించిన ఆ సంస్థ మిగిలిన 538.62 కోట్ల రూపాయలను చెల్లించడంలో విఫలమైంది. ఈ క్రమంలో సీబీఐ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టి జెట్ ఎయిర్‌వేస్ కెనరా బ్యాంకును మోసం చేసినట్టు గా తేల్చింది. అయితే ఈ కేసులో మనీలాండరింగ్ కు సంబంధించిన అంశాలు సైతం ఉన్నాయని తేలడంతో ఈడీ రంగంలోకి దిగి, 2023 సెప్టెంబరు 1న గోయల్‌ను అరెస్ట్ చేసింది.
Also Read: లేడీ టీచర్ మిస్సింగ్ కేసులో ట్విస్ట్… అక్కా అక్కా అంటూనే అతను మాస్టర్ ప్లాన్ వేసి..?
End of Article