మిస్ ఇంగ్లాండ్ కిరీటాన్ని పక్కన పెట్టి…కరోనాపై పోరుకు దిగిన భారత సంతతి డాక్టర్..!

మిస్ ఇంగ్లాండ్ కిరీటాన్ని పక్కన పెట్టి…కరోనాపై పోరుకు దిగిన భారత సంతతి డాక్టర్..!

by Anudeep

ఎక్కడ నెగ్గాలో కాదు..ఎక్కడ తగ్గాలో తెలిసిన వారే గొప్పవారు. మన అవసరం ఉందనుకున్నప్పుడు, మన సాయం కొంతమందికి అవసరం అనుకున్నప్పుడు, వారు స్వయంగా అడగకపోయినా మనం ఎంత గొప్ప స్థానంలో ఉన్న ఆ స్థానాన్ని విడిచి వారికి సాయపడినప్పడే అసలైన గొప్పతనం. అదే నిరూపించుకుంది మిస్ ఇంగ్లాండ్ కిరీటం దక్కించుకున్న వైద్యురాలు. కరోనాతో అల్లాడిపోతున్న తన దేశానికి వైద్యం అందించడానికి తన కిరిటాన్ని పక్కన పెట్టి ముందుకు వచ్చింది.

Video Advertisement

మిస్ ఇంగ్లాండ్  భాషా ముఖర్జి  వృత్తిరిత్యా డాక్టర్ .భాషా ముఖర్జి భారత సంతతికి చెందిన వారే కావడం విశేషం. భాషా ఎనిమిదేళ్ల వయసులోనే కోల్ కతా నుండి యుకె వెళ్లి అక్కడే సెటిల్ అయ్యారు. యుకెలోని తన వైద్య విధ్యను కంప్లీట్ చేసి శ్వాసకోస వైధ్యంలో స్పెషలిస్ట్ గా పట్టాపొందారు. తర్వాత మోడలింగ్ పై ఆసక్తితో అటుగా ప్రయాణించారు. అందులో భాగంగానే 2019లో మిస్ ఇంగ్లాండ్ గా కిరిటాన్ని దక్కించుకుంది. మిస్ ఇంగ్లాండ్ గా ఎన్నికైన తర్వాత వైద్యవృత్తికి విరామం ఇచ్చి ఒక ఛారిటిపై ఫోకస్ పెట్టారు. ఆ ఛారిటిపనుల్లోనే నిమగ్నమయ్యారు.

అయితే ఇప్పుడు ప్రపంచదేశాలన్ని కరోనాని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అందులో యుకె కూడా ఒకటి.యుకెలో కరోనా తీవ్రంగానే ఉంది.  తన డాక్టర్ ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితులను మెసేజెస్ చేస్తున్నారని, అందుకే తను తిరిగి యుకె రావాలనుకున్నానని, వైద్యురాలిగా తన సేవలు  అందించాలని అనుకుంటున్నాని చెప్పారు భాషా , ఇప్పుడు తను రెండు  వారాలపాటు ఐసోలేషన్లో ఉండాల్సి ఉంది. ఐసోలేషన్ పీరియడ్ ముగిసిన తర్వాత భాషా ముఖర్జీ ఫిలిగ్రిమ్ ఆస్పత్రిలో డాక్టర్ గా పనిచేయనున్నారు.

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి సోకి ప్రాణాలు కోల్పోతుంటే తన తోటి వైద్య సిబ్బంది కరోనా బాధితుల కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారని,ఇలాంటి పరిస్థితుల్లో మానవతా దృక్పథంతో మెలగాల్సిన అవసరం ఉందని, మిస్ ఇంగ్లాండ్ కిరీటం ధరించడంలో అర్థం లేదని యుకె మీడియాకు చెప్పుకొచ్చింది. ఇప్పుడు నేను కిరీటం ధరించిన మిస్ ఇంగ్లాండ్ కన్నా, స్టెతస్కోప్ పట్టి డాక్టర్ గా సేవచేయడంలోనే అర్దం ఉందని తన మానవత్వాన్ని చాటుకుంది. భాషా ముఖర్జి నిర్ణయం పట్ల నెటిజన్లందరు తనని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.

 


You may also like