పెళ్ళైన యువతిని ముగ్గులోకి దింపి.. పెళ్లి మాట వచ్చేసరికి ప్లేట్ మార్చేసిన డాక్టర్.. ఈ స్టోరీ చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది..!

పెళ్ళైన యువతిని ముగ్గులోకి దింపి.. పెళ్లి మాట వచ్చేసరికి ప్లేట్ మార్చేసిన డాక్టర్.. ఈ స్టోరీ చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది..!

by Anudeep

Ads

ఫేస్ బుక్ పరిచయాలు ఎందరి కొంపలనో కొల్లేరు చేస్తున్నాయి. ఫేస్ బుక్ లో గుర్తు తెలియని వ్యక్తులను పరిచయం చేసుకుని మోసపోతున్న అమ్మాయిల సంఖ్య తక్కువేమీ కాదు. తాజాగా.. మరో ఉదంతం చోటు చేసుకుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుడి గా పని చేస్తున్న ఓ వ్యక్తి సోషల్ మీడియా లో ఓ మహిళతో పరిచయం పెంచుకున్నాడు.సదరు మహిళకు అప్పటికే పెళ్లయింది.

Video Advertisement

doctor cheats a women 3

అయినప్పటికీ.. అతని మాటల మాయలో పడింది. పెళ్లి చేసుకుంటానని సదరు డాక్టర్ నమ్మించడం తో.. ఆమె నమ్మి, భర్తని వదిలేసి అతని వద్దకు వెళ్ళిపోయింది. దాదాపుగా ఐదేళ్ల పాటు ఇద్దరు సహజీవనం చేసారు. ఈ క్రమం లో పలుమార్లు శారీరకం గా కూడా దగ్గరవడం తో ఆమెకు ఓ బాబు పుట్టాడు. అయితే..ఇప్పటికైనా పెళ్లి చేసుకోవాలని ఆమె ఆ డాక్టర్ ని కోరింది.

doctor cheats a women 4

కానీ, అతను ఏదో ఒక కుంటి సాకుతో తప్పించుకునేవాడు. పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి పెంచడం తో ఆమెకు నరకం చూపించడం స్టార్ట్ చేసాడు. అప్పటివరకు నవ్వుతూ, తుళ్ళుతూ గడిచిన రోజులు ఆమెకు భారం గా మారాయి. ఆమెను ఇంట్లోంచి వెళ్ళగొట్టాడు. ఆమె న్యాయం కోసం ఆ ఇంటి ఎదురుకుండానే, రోడ్డు పై కూరలు అమ్ముకుని జీవిస్తోంది. రోజులేనిది ఆమె అక్కడ కొత్తగా కనిపించడం తో చుట్టుపక్కల వారు ఆమె గురించి ఆరా అడిగారు.

doctor cheats a women 2

దానితో.. ఆమె తనను ఆ డాక్టర్ ఎలా మోసం చేసాడో చెప్పుకొచ్చింది. ఆ పిల్లాడిని చూపించి ఆ డాక్టర్ కు తనకు పుట్టిన కొడుకేనని, కానీ ఆ డాక్టర్ కొడుకుని అంగీకరించడం లేదని చెప్పుకుని వాపోయింది. మరోవైపు సదరు డాక్టర్ చెప్పే వాదన మరోలా ఉంది. ఆమె ఫేస్ బుక్ లో ఎల్ ఐసి ఏజెంట్ గా పరిచయం అయిందని, ఓ రోజు తన తల్లి అనారోగ్యం గా ఉందని తీసుకొచ్చిందని చెప్పుకొచ్చాడు. ఆమె ఇబ్బందుల్లో ఉందని చెప్పడం తో ఆమెకు పనిమనిషి గా ఉద్యోగం ఇచ్చి.. నెలకు పదిహేను వేల జీతం ఇచ్చానని చెప్పుకొచ్చాడు.

doctor cheats a women 1

అప్పటికే ఆమెకి పెళ్లయిందని.. ఆ కొడుకు ఆమెకు, ఆమె భర్తకు పుట్టిన కొడుకని.. కేవలం స్వార్ధం కోసమే నన్ను బ్లాక్ మెయిల్ చేసి సెటిల్ అవ్వాలని అనుకుంటోందని చెప్పుకొచ్చారు. ఇది ఇలా ఉంటె.. డీఎస్పీ శక్తి సింగ్ స్పందిస్తూ.. సదరు మహిళ డాక్టర్ జీడీ సింగ్ పై కేసు నమోదు చేసిందని, ఆమె ఫిర్యాదు మేరకే ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.


End of Article

You may also like