Ads
పుట్టిన ప్రతి జీవి గిట్టక తప్పదు.. మరణం అనేది తప్పించుకోలేనిది. ఎంతటి కోటీశ్వరుడైనా, పేదవాడైనా చివరకు మట్టిలో కలిసిపోవాల్సిందే. కానీ నూరేళ్లు బతికిన పండు ముసలి కూడా ఇంకొంత కాలం బతికితే బాగుండు అనుకుంటుంది. జీవితం మీద తీపి అలాంటిది. కానీ తన మరణం గురించి ముందే తెలిసిన ఈ యువకుడు చేసిన చేసిన పని అందరి హృదయాలను కలచివేసింది.
Video Advertisement
తాము త్వరలో చచ్చిపోతామని తెలిస్తే ఎంతలా ఢీలా పడిపోతాం.. బతికుండగానే చావుకళ ఆవహిస్తుంది..మృత్యువు భయం రూపంలో రోజురోజుకూ కబళిస్తుంది.. ఆ ఉన్నన్ని రోజులూ.. నిరాశ, నిస్పృహ, నైరాశ్యం, దుఖంతోనే ఉంటారు. కానీ తాను చనిపోతున్నా అని తెలిసినా కూడా హర్షవర్షన్ ఉన్నన్ని రోజులు హ్యాపీగా బతికాడు..ఆఖరికి చనిపోయాక మృతదేహాన్ని కూడా తరలించడానికి ఏర్పాట్లు చేసుకున్నాడు. మూడు పదుల వయసుకే నిండునూరేళ్లు నిండిపోయిన ఓ యువకుడి జీవిత గాధ ఇది..
ఖమ్మంలోని శ్రీనివాస్ నగర్ కు చెందిన ఏపూరి రామారావు, ప్రమీల దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కొడుకు హర్షవర్ధన్ (33), చిన్న కొడుకు అఖిల్. హర్షవర్ధన్ బీఫార్మసీ పూర్తి చేసిన తర్వాత ఉన్నత చదువుల కోసమని 2013లో ఆస్ట్రేలియా వెళ్ళాడు. ఆ తర్వాత అక్కడే క్వీన్స్ ల్యాండ్ లోని ఓ ప్రైవేటు హాస్పిటల్ లో డాక్టర్ గా చేరాడు. 2020 ఫిబ్రవరి 20న ఖమ్మం వచ్చి సింధు అనే యువతిని వివాహం చేసుకున్నాడు.
అనంతరం అదే నెలలో తిరిగి ఉద్యోగరీత్యా ఆస్ట్రేలియా వెళ్లిపోయారు. తన భార్య సింధుకు వీసా ప్రాబ్లం ఇక్కడే ఉండిపోయింది. ఇక తర్వాత కరోనా లాక్ డౌన్ కారణంగా తన ప్రయాణం వాయిదా పడింది. ఇక ఎంతో ఆరోగ్యంగా ఉండే హర్ష వర్ధన్ అదే ఏడాది అక్టోబరు నెలలో వ్యాయామం చేస్తుండగా దగ్గుతో పాటు ఆయాసం రావడంతో వైద్య పరీక్షలు చేయించుకోగా ఊపిరితిత్తుల క్యాన్సర్ సోకిందని వైద్యులు నిర్ధారించారు. ఈ పరిస్థితుల్లో ఇంటికి తిరిగి వచ్చేయమని తల్లిదండ్రులు కోరగా ఇక్కడే మంచి చికిత్స లభిస్తుంది. మీరేం కంగారు పడకండి అని వారికి నచ్చజెప్పాడు.
కానీ అక్కడ ఆస్ట్రేలియాలో అద్భుతమైన అధునాత వైద్యం తీసుకున్నప్పటికీ చావు నుంచి ఎలాగూ తప్పించుకోలేం అని డిసైడ్ అయిపోయాడు..అందుకే ఉన్న నాలుగురోజులు ధైర్యంగా బతికాడు. తనని కన్నవాళ్లని ప్రేమగా చూసుకున్నాడు.ఉన్న నాలుగురోజులు వారితో గడిపాడు. పది రోజులు కూడా తనతో లేని భార్య జీవితం అలాగే ఆగిపోకూడదు అనుకోని.. ఆమెను ఒప్పించి విడాకులు తీసుకున్నాడు.
తల్లిదండ్రులు జీవితమంతా సుఖంగా బతికేలా ఏర్పాట్లు చేశాడు..ఆఖరికి తాను చనిపోయాక ఆస్ట్రేలియా నుంచి తన మృతదేహాన్ని తీసుకెళ్లడానికి కూడా తల్లిదండ్రులు ఎలాంటి ఇబ్బందీ పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నాడు. ఆస్ట్రేలియాలో తన మరణానంతరం వ్యవహారాలు చూసుకోవడానికి, మృతదేహాన్ని కార్గోలో ఇండియాకు తరలించడానికి ఒక పెద్ద లాయర్ ను ఏర్పాటు చేసుకున్నాడు..చనిపోయేముందు 2022 సెప్టెంబరు లో సొంతూరుకు వచ్చి 15 రోజులు గడిపి వెళ్లారు.
అయితే వ్యాధి రోజురోజుకూ ఎలా తన ఊపిరితిత్తులను పాడు చేస్తోందో డాక్టర్ గా అర్థం చేసుకున్నాడు. ఆరోగ్యం క్షీణించడంతో చివరి రోజుల్లో తరచూ బంధువులకు వీడియోకాల్ చేసి మాట్లాడేవాడు. తాను ఎలా ఉన్నానో ప్రతి రోజూ తల్లిదండ్రులకు వీడియో కాల్ లో చెప్పేవాడు. తన స్నేహితులకు నేను మరొక గంట కంటే ఎక్కువ సమయం మీ ముందు ఉండకపోవచ్చు అని నేను కొంచెం రెస్ట్ తీసుకుంటా అని పడుకున్నాడు. అంతే రెండు నిమిషాల తర్వాత 32 సంవత్సరాల హర్ష వర్ధన్ శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయాడు. ఇలా తన బాధ మొత్తాన్ని తన గుండెల్లోనే దాచుకుని కడసారి వీడ్కోలు చెప్పాడు హర్ష వర్ధన్.
End of Article