Ads
బిగ్ బాస్ కి ఎంత ఫాలోయింగ్ ఉందో తెలియనిది కాదు. అందరు తిడుతూనే ఉన్నా సరే.. బిగ్ బాస్ కంటెస్టెంట్ లపై నెగటివ్ ట్రోలింగ్ ఉంటున్నా కూడా రెగ్యులర్ గా చూసే వాళ్ళు చాలా మందే ఉన్నారు. గత బిగ్ బాస్ సీజన్ కొంత నిరాశపరిచినమాట వాస్తవమే. బిగ్ బాస్ సీజన్ లో క్రేజ్ ఉన్న సెలెబ్రిటీలు తక్కువే. దీనితో అభిమానులు కూడా కొంచం అప్ సెట్ అయ్యారు.
Video Advertisement
దీనితో, సీజన్ ఫైవ్ లో బిగ్ బాస్ కొత్త ప్లానింగ్ తో ముందుకు రాబోతున్నాడని తెలుస్తోంది. బుల్లితెరపై ప్రేక్షకులను అలరిస్తున్న సెలెబ్రిటీలను, సోషల్ మీడియా లో దుమ్ము దులిపేస్తున్న షార్ట్ ఫిలింస్ స్టార్లను తీసుకొచ్చి బిగ్ బాస్ హౌస్ లో సందడి చేయించనున్నారు. ఇటీవలే కంటెస్టెంట్స్ వీరే అన్న ఓ లిస్ట్ కూడా సోషల్ మీడియా లో హల్ చల్ చేసింది. ఈ లిస్ట్ లో షణ్ముఖ్ పేరు కూడా ఉంది.
సాఫ్ట్ వేర్ డెవలపర్ వెబ్ సిరీస్ తో సోషల్ మీడియా ను ఓ ఊపు ఊపేసిన షణ్ముఖ్ రీసెంట్ గా “సూర్య” వెబ్ సిరీస్ తో కూడా ఆకట్టుకున్నారు. దీనితో అత్యంత ఎక్కువ రెమ్యునరేషన్ ను ఇచ్చి షణ్ముఖ్ ని బిగ్ బాస్ కు తీసుకొస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే.. తాజాగా మరో వార్త ప్రచారం అవుతోంది.
బిగ్ బాస్ కోసం షణ్ముఖ్ కోటి రూపాయలు అడిగారని.. అంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి స్టార్ మా ముందుకు రాలేదని తెలుస్తోంది. దీనితో షణ్ముఖ్ ను కంటెస్టెంట్ గా తీసుకోవాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని స్టార్ మా భావిస్తోందని ఈ వార్తల సారాంశం. దీనితో షణ్ముఖ్ రిజెక్ట్ అవ్వడం పై రూపొందించబడ్డ ఈ ఫన్నీ వీడియో నెటిజన్లను ఆకర్షిస్తోంది. దీనిపై మీరు కూడా ఓ లుక్ వేయండి.
Watch Video:
https://www.youtube.com/watch?v=7WaoyrIztDM
End of Article