అదే “చిట్టి” కి సమస్య గా మారిందా..? దాని వలనే అవకాశాలు రావడం లేదా..?

అదే “చిట్టి” కి సమస్య గా మారిందా..? దాని వలనే అవకాశాలు రావడం లేదా..?

by Anudeep

Ads

“జాతి రత్నాలు” సినిమా మీలో చాలా మంది చూసే వుంటారు. కొంతమందికి సినిమా బాగా నచ్చేసింది. కొందరు ఈ సినిమా ను అంత గా మెచ్చుకోకపోయినా.. చిట్టిని మాత్రం మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. అందులోను.. కోర్ట్ సీన్ లో చిట్టి యాక్టింగ్ హైలైట్. మొత్తానికి జాతి రత్నాలు సినిమా చిట్టి గా నటించిన ఫరియా అబ్దుల్లా కు ఫ్యాన్ ఫాలోయింగ్ గట్టి గానే ఉంది.

Video Advertisement

faria 1

ఆకట్టుకునే రూపం, మంచి నటన.. ఇలా చిట్టి పాత్రలో చాలా నే పెర్ఫార్మన్స్ చేసింది ఫరియా. కానీ.. ఇంతలా ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ కు మంచి ఆఫర్స్ మాత్రం రాలేదని తెలుస్తోంది. ఏదైనా సినిమా హిట్ అయింది అంటే చాలు.. అవకాశాలు వెల్లువలా వచ్చేస్తూ ఉంటాయి. అలాంటిది.. చిట్టి కి ఇంత పాపులారిటీ వచ్చాక కూడా అంతగా అవకాశాలు రాలేదా? అని ఫాన్స్ కి కూడా డౌట్ వచ్చేస్తుంది.

fariya 2

ఇప్పటి వరకు ఫరియా అబ్దుల్లా ను ఫలానా సినిమాలో తీసుకున్నాం అంటూ చెప్పే వార్తా ఒక్కటి కూడా రాలేదు. ఇంతకీ.. మన చిట్టి కి అవకాశాలు రాకపోవడానికి కారణం ఆమె ఎత్తే అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఫరియా అబ్దుల్లా అనుష్క శెట్టి కంటే హైట్ ఉంటారట. అందుకే ఆమెకు అవకాశాలు రావడం లేదు అని కొందరు అంటున్నారు. కానీ, టాలెంట్ కి ఏది అడ్డు రాదు కాబట్టి.. ఆమెకు తొందరలోనే మరిన్ని అవకాశాలు లభించి మనందరినీ ఎంటర్టైన్ చేయాలనీ కోరుకుందాం.


End of Article

You may also like