ఆ నటి కారణంగానే బాలకృష్ణ, రవితేజ మధ్య గొడవలా…? అసలేం అయ్యింది..?

ఆ నటి కారణంగానే బాలకృష్ణ, రవితేజ మధ్య గొడవలా…? అసలేం అయ్యింది..?

by Megha Varna

Ads

ఆహాలో బాలకృష్ణ అన్ స్టాపబుల్ టాక్ షోకి హోస్ట్ గా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆ షోకి రవితేజ గెస్ట్ కింద వచ్చారు. వీళ్ళ ఇద్దరు మధ్య జరిగిన ఒక విషయం పై మాట్లాడడం కూడా జరిగింది. ఈ షో ప్రోమో వచ్చింది. అసలేం ఏమైంది..? నిజంగా వీళ్ళు ఇద్దరు ఒక హీరోయిన్ వల్ల గొడవ పడ్డారా అనేది చూస్తే…

Video Advertisement

ఇండస్ట్రీలో బాలకృష్ణకి, రవితేజకి తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. వీరిద్దరికీ సంబంధించిన ఒక వార్త గత 15 ఏళ్లుగా విపరీతంగా చక్కర్లు కొడుతోంది. వీళ్ళు మాట్లాడుకోవడం లేదని, గొడవ పడ్డారని వచ్చిన ఆ వార్త సెన్సేషన్ గా మారింది.

వీళ్లిద్దరూ గొడవ పడడానికి మధ్య కారణం ఒక హీరోయిన్ అని.. కోపాన్ని తట్టుకోలేక రవితేజ పై బాలకృష్ణ చెయ్యి చేసుకున్నాడని కూడా వార్త వచ్చింది. ప్రత్యేకంగా ఈ విషయంపై ఎప్పుడూ స్పందించలేదు. నిజంగానే గొడవలు జరిగాయని చాలా మంది అనుకున్నారు.

కానీ ఈ షో తో ఈ గొడవ పై క్లారిటీ ఇచ్చేశారు. మన ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది కదా అని బాలయ్య రవితేజను అడిగారు. దానికి రవితేజ కూడా నవ్వుతూ సమాధానం ఇచ్చారు.  భద్ర సినిమా సమయంలో మీరా జాస్మిన్ విషయంలో రవితేజ, బాలయ్య మధ్య గొడవ జరిగిందని అప్పట్లో తెగ ప్రచారం జరిగింది. ఈ విషయంపై రవితేజ పనీ పాటలేని కొందరు రాసిన తప్పుడు వార్తలు అంటూ కొట్టిపారేశారు.


End of Article

You may also like