మనం కొంచెం ప్రేమ చూపిస్తే చాలు వాటి జీవితాంతం వరకు మనల్ని కనిపెట్టుకుని ఉంటాయి. ఆఖరికి పెంచిన వారికోసం తమ ప్రాణాలని కూడా అర్పించడానికి సిద్దపడతాయి. ఇప్పటివరకు కుక్కలు తమ విశ్వాసాన్ని చాటుకున్న ఎన్నో ఘటనలు చూసాము. తాజాగా ఖమ్మం జిల్లాలో యజమాని ప్రాణాలు కాపాడడం కోసం విషసర్పంతో ఫైట్ చేసి చనిపోయింది ఒక శునకం..

Video Advertisement

ఖమ్మం జిల్లా కల్లూరుకి చెందిన కిశోర్  కుటుంబం ఒక  పెంపుడు కుక్కని పెంచుకుంటున్నరు…పేరు స్నూపి . కిషోర్ కుటుంబం మొత్తం దాన్ని అల్లారుముద్దుగా చూసేవారు. ఇటీవల కిషోర్ ఇంటికి వెనుక గదిలో నిద్రపోతున్నాడు.. ఇంతలో అతడి మంచం కిందకు ఒక పాము వచ్చింది. గోధుమరంగులో ఉన్న ఆ పాము బుసలు కొడుతూ కిషోర్ ని కాటువేయడానికి అతడి వైపు వెళుతుండగా అక్కడే ఉన్న స్నూపి ఆ విషయాన్ని గమనించింది. అంతే పెద్దగా అరవడం మొదలు పెట్టింది.

స్నూపి అరుపులకి నిద్ర లేచిన కిషోర్ వెంటనే అతడికి సమీపంలో ఉన్న పాముని చూసాడు . అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే పాము కిషోర్ ని కాటువేయబోయింది. అక్కడే ఉన్న స్నూపి ఒక్క ఉదుటన పాము పైకి దూకి నోటకరిచి పట్టుకుని పక్కకి విసిరేసింది. కొద్దిసేపు పాముతో ఫైట్ చేస్తుండగా పాము స్నూపిని కాటేసింది. అయినా స్నూపి భయపడకుండా పాముని బయటికి లాక్కొచ్చింది.

ఇంతలో కిషోర్ కర్ర తీసుకొచ్చి పాముని కొట్టి చంపి, వెంటనే స్నూపిని తీసుకుని వెటర్నరీ హాస్పిటల్ తీసుకెళ్తుండగా  మార్గమద్యలోనే మరణించింది.తన ప్రాణాలు కాపాడటానికి పాముతో పోరాడి తన ప్రాణం కోల్పోయిన పెంపుడు కుక్కిన తలచుకొని కిశోర్‌, అతడి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.

watch video: