దొంగతనం చేయడానికి వెళ్ళాడు…సోఫాలో నిద్రపోయాడు..! చివరికి ఏమైందో తెలుసా?

దొంగతనం చేయడానికి వెళ్ళాడు…సోఫాలో నిద్రపోయాడు..! చివరికి ఏమైందో తెలుసా?

by Anudeep

Ads

దొంగతనానికి వెళ్లేవాళ్లు ఎంత అలర్ట్ గా ఉండాలి. ప్లాన్ చేసినప్పటి నుండి దొంగతనం పూర్తయ్యేవరకు ప్రతి విషయం పట్ల ఎంత జాగ్రత్తగా ఉండాలి . అన్ని పక్కాగా ప్లాన్ చేసుకున్నాకే రంగంలోకి దిగాలి . దొరికిపోకుండా ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలో అన్నింటిని పాటించాలి . అలా కాకుండా ఒక్కటి మిస్ చేసినా , పొరపాటున దొరికిపోయామో అంతే సంగతులు . ఏంటి దొంగతనం చేయడంలో ఫర్ఫెక్ట్ అన్నట్టు ఇంత బాగా చెప్తున్నారు అనుకుంటున్నారా? ఎన్ని సినిమాల్లో చూడం అండీ. సరే అసలు విషయానికొద్దాం. మీరిప్పటివరకు దొంగతనానికి వచ్చి , వచ్చిన పని చూసుకుని పోయే దొంగనే చూసుంటారు , కానీ మన స్టోరీలో దొంగ మాత్రం ఎంచక్కా నిద్రపోయాడు . తర్వాత ఏం జరిగిందో చదవండి.

Video Advertisement

కర్నాటకలోని దక్షిణ కన్నడ జిల్లా ఉల్లాస్ జంక్షన్ దగ్గర ఈ వింత ఘటన జరిగింది. ఆ దొంగ పేరు అనిల్ సహాని. మనోడు మంచి మందు ప్రియుడు  , అదేనండి తాగుబోతు . మొన్నీమధ్య ఒక రోజు దొంగతనం చేయాలని ఫిక్సయి , అర్దరాత్రి  ఎంతో కష్టపడి ఇంటి పైకప్పు తొలగించి లోపలికి వెళ్లాడు . మనోడి అదృష్టం బాగుండి టీవీ స్టాండ్ దగ్గరే తాళాలు కనిపించాయి , వెంటనే తాళాలు తీసుకుని విలువైన వస్తువులన్నీ మూటకట్టాడు . ఎంచక్కా వాటినన్నింటి తీసుకుని బయటపడాలని ప్లాన్ వేశాడు .మనోడు అప్పటికే మందుకొట్టి ఉన్నట్టున్నాడు, కిక్కు ఎక్కువైందో మరే కారణమో కానీ నిద్ర ముంచుకొచ్చినట్టైంది .

ముందు నిద్ర ,  తర్వాతే దొంగతనం అని  ఆ ఇంట్లో ఓ మూలన కనిపించిన సోఫాలో హాయిగా నిద్రపోయాడు. అతడు ఎంత డీప్ స్లీప్ లోకి వెళ్లాడంటే చూస్తుండగానే, తెల్లవారినా కానీ మెలకువ రానంత . ఉదయం ఇంటి పైకప్పు తొలగించి ఉండడం చూసిన యజమాని సుదర్శన్‌ షాక్ అయ్యాడు. గదిలో చూస్తే చక్కగా సోఫాలో గుర్తు తెలియని ఓ వ్యక్తి పడుకోవడం చూసి మరింత కంగుతిన్నాడు. అతను కచ్చితంగా దొంగే అని గ్రహించి వెంటనే పోలీసులకు ఫోన్ చేశాడు. ఆ తర్వాత ఓ కర్ర తీసుకుని వచ్చి సోఫాలో డీప్ స్లీప్ లో ఉన్న దొంగను కొట్టి లేపాడు. ఎవరో తనను లేపుతున్నట్టు అనిపించి దొంగ కళ్లు తెరిచాడు. అంతే.. షాక్ కి గురయ్యాడు.

తాను అడ్డంగా దొరికిపోయానని తెలుసుకుని నిర్ధాంతపోయాడు. అతడి నోట మాట రాలేదు. ఇంతలో అక్కడికి చేరుకున్న పోలీసులు దొంగను అదుపులోకి తీసుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. దొంగను బీహార్‌ కి చెందిన అనిల్ సహానీగా పోలీసులు గుర్తించారు. అతను మద్యం మత్తులోనే దొంగతనానికి పాల్పడ్డాడని.. మత్తెక్కి నిద్రపోయాడని పోలీసులు తెలిపారు. ఈ దొంగ కథ సోషల్ మీడియలో వైరల్ అయి వీడేం  దొంగరా బాబూ అంటూ నెటిజన్లంతా  నవ్వుకుంటున్నారు . మొత్తానికి ఈ దొంగతనంతో మనోడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాడు.


End of Article

You may also like