97
Ads
పండ్లలో రారాజు అయిన మామిడి పండ్లను తినాలని ఎవరికి ఉండదు చెప్పండి. మామిడి పండు ఇష్టపడని వారు చాలా తక్కువ మంది ఉంటారు. అందులోను ఎండాకాలం వచ్చిందంటే చాలు అన్ని రకాల మామిడి పండ్లను ట్రై చేసేస్తూ ఉంటారు. అలానే మామిడి పండ్లతో రకరకాల డిసర్ట్స్, జ్యూస్స్, మాంగో షేక్స్ లాంటివి కూడా ట్రై చేసే వారు కోకొల్లలు.. అయితే.. అతి సర్వత్రా వ్యర్జయేత్ అన్న మాట మరిచిపోకూడదు. ఏది అయినా సరే.. మితి మీరకుండా తిన్నంత వరకు ఏ ఇబ్బంది ఉండదు.
Video Advertisement
మామిడి పండును ఎక్కువ గా తీసుకుంటే వేడి చేస్తుంది. అలాగే.. మామిడి పండ్లు తిన్న తరువాత కొన్ని పదార్ధాలను తీసుకోకూడదు. అవేంటో.. తీసుకుంటే ఏమి అవుతుందో ఇప్పుడు చూద్దాం.
- మామిడి పండ్ల లో ఎక్కువ చక్కర శాతం ఉంటుంది. వీటిని తీసుకున్న వెంటనే శీతల పానీయాలను తీసుకోవడం వలన శరీరం లో చక్కర శాతం ఎక్కువ అయ్యి అనారోగ్య సమస్యలు వస్తాయి.
- అలాగే ఇవి తినగానే మంచినీళ్లు ఎక్కువ గా తాగడం వలన శరీరం లో అనేక రసాయనాలు ఉత్పత్తి అయ్యి ఉదర సంబంధ సమస్యలు వస్తాయి.
- అలాగే మామిడి పండుతో పాటు కాకరకాయలు తినకూడదు. దీని వలన శ్వాస సంబంధిత సమస్యలతో పాటు నాసియా (nausea) వంటి ఇబ్బందులు కూడా తలెత్తుతాయి.
- మామిడి పండు తో పాటు గాని, ముందు గాని, తిన్నాక గాని పెరుగు తీసుకోవడం వలన అధికం గా కార్బన్ డై ఆక్సయిడ్ ఉత్పత్తి అవుతుంది. దీనివలన అనారోగ్యం వస్తుంది.
- మామిడి పండు తిన్న తరువాత కారం గా ఉండే పదార్ధాలు గాని, ఎండు మిర్చి తో చేసిన పదార్ధాలను గాని తీసుకోకూడదు. దీనివలన చర్మ సంబంధ సమస్యలు, ఉదర సంబంధ సమస్యలు వస్తాయి.
End of Article