మనం వాడే ప్లాస్టిక్ వలన ఎంత నష్టం కలుగుతుందో మనకు తెలుసు. ఇప్పటికే చాలా షాపుల్లో ప్లాస్టిక్ కవర్లు నిషేధించి పేపర్ కవర్లు లేదా చేతి సంచులను వినియోగించాలని కోరుతున్నారు. అయితే.. ప్లాస్టిక్ కూడా అవసరం అయిపోయిన ఈ రోజుల్లో పూర్తి గా నిషేధించడం మాత్రం సాధ్యపడలేదు.

2 milk packet

అలాగే.. మనం నిత్య జీవితం లో చేసే చిన్న చిన్న తప్పుల వలన పర్యావరణానికి తీవ్రం గా నష్టం వాటిల్లుతోంది. ప్లాస్టిక్ కవర్లను కనీసం రీసైకిల్ చేయవచ్చు. కానీ.. చిన్న చిన్న ముక్కలు గా కట్ చేయబడ్డ ప్లాస్టిక్ ను రీసైకిల్ చేయడం సాధ్యం కాదు. అందుకే తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కర్ణాటక బీజేపీ వైస్ ప్రెసిడెంట్ తేజస్విని అనంత కుమార్ సూచనలు చేయడం ప్రారంభించారు. ఆమె చెబుతూ.. మనం పాల ప్యాకెట్లనుంచి, ఇతర గ్రోసరీస్ ప్యాకెట్ల వరకు కట్ చేసే చిన్న ముక్కలు పర్యావరణానికి ఎంత హాని చేస్తున్నాయో చెప్పారు.

1 milk packet

చెత్త నుంచి ప్లాస్టిక్ కవర్లను వేరు చేయగలిగిన.. ఈ చిన్న చిన్న ముక్కలను వేరు చేయడం సాధ్యం కాదు. కానీ ఇవి చెరువులలోను, నదుల్లోను, సముద్రాల్లోను కలిసిపోయి జల జీవరాసుల ప్రాణాలకు ముప్పు గా పరిణమించాయి. ఈ చిన్న ముక్కలను అవి తెలియక తినడం వలన అవి పేగులకు చుట్టుకుని మరణిస్తున్నాయి. ఇందుకోసం.. కర్ణాటక బీజేపీ వైస్ ప్రెసిడెంట్ తేజస్విని అనంత కుమార్ ఓ పరిష్కారాన్ని కూడా చూపించారు. ప్యాకెట్ లను చిన్న ముక్కలు గా రాకుండా ఎలా కట్ చేయాలో చూపించారు. ఆ వీడియో ను మీరు కింద ట్విట్టర్ లింక్ లో చూడవచ్చు. మీరు కూడా అలానే చేస్తూ.. పర్యావరణాన్ని కాపాడండి.

watch video: