ప్రస్తుతం కరోనా మహమ్మారి తీవ్ర రూపం దాల్చి ఉంది. ఈ క్రమం లో చాలా మంది ఆక్సిమీటర్లను కొనుగోలు చేసుకుని పల్స్ చెక్ చేసుకుంటున్నారు. మరికొందరేమో ఫోన్ లోనే ఆప్ లను డౌన్ లోడ్ చేసుకుని చెక్ చేసుకుంటున్నారు.ఫోన్ లో ఆప్ డౌన్లోడ్ చేసుకునే వారు జాగ్రత్త పాటించాలి. ఎందుకంటే.. ఈ యాప్ లు అన్ని నిజమైనవి కావు.

oximeter

చాలా యాప్ లో మీ ఫోన్ లో డేటా ను చోరీ చేసి థర్డ్ పార్టీలకు అమ్మకం పెడుతున్నాయి. పైగా.. ఇవి చూపించే పల్స్ రేట్స్ లలో కూడా ఖచ్చితత్వం ఉండదు. వైద్య సంబంధిత అవసరాలకు ఇది ఉపయోగించరాదు. కేవలం పర్సనల్ గా చూసుకోవడం మాత్రమే ఈ యాప్ లు పనికివస్తాయి. కాబట్టి డౌన్ లోడ్ చేసుకునే ముందు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవడం మంచిది.