దూరంగా ఉంటేనే మంచిది…కష్టమే కానీ తప్పదు..! మహేష్ బాబు సంచలన పోస్ట్..!

దూరంగా ఉంటేనే మంచిది…కష్టమే కానీ తప్పదు..! మహేష్ బాబు సంచలన పోస్ట్..!

by Anudeep

ఒక్క వ్యక్తితో ఏం జరుగుతుంది అనుకుంటాం , కాని ఒక్క వ్యక్తి తల్చుకుంటే ఏదైనా సాధించొచ్చు,దేన్నైనా వినాశనం చేయొచ్చు. కరోనా వచ్చింది ముందు ఒక్క వ్యక్తే, ఒకరి నుండి ఇప్పుడు ఇంత మందికి, దేశాలు దేశాలే భయపడే పరిస్థితి. అదే నా ఒక్కడి వల్ల ఏం అవుతుంది అనుకుంటే, అవుతుంది వ్యాప్తి  చెందకుండా ఆపడం మన వల్లనే అవుతుంది. దాని కోసం మనం చేయాల్సింది కొద్దిరోజులు మన జీవన శైలిని మార్చుకుంటే చాలు ఇదే విషయాన్ని చెప్పారు ప్రిన్స్ మహేశ్ బాబు.

Video Advertisement

కలిసి పోరాడితే కరోనాని తరిమి కొట్టడం కష్టమేం కాదని  ఒక అర్దవంతమైన వీడియో ద్వారా వివరించారు ప్రిన్స్ మహేశ్ బాబు . ఇప్పుడు ప్రతి ఒక్కరం పాటించాల్సింది ఒకటే అని కేవలం అందరి నుండి దూరంగా ఉండడమే అని, మన సామాజిక జీవనాన్ని కొద్ది రోజులు దూరం చేసుకోవాలని తన పోస్టులో మెన్షన్ చేశారు. ఇది చాలా కష్టం అయినప్పటికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇదే సరైన మార్గం అన్నారు.

టాలివుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేశ్ బాబు తన ఇన్స్టగ్రాం అకౌంట్లో పోస్టు చేసిన వీడియో ఆలోచింపచేస్తుంది. అంతేకాదు ప్రిన్స్ చెప్పిన నాలుగు మాటలు కూడా బాగున్నాయంటూ నెటిజన్లు అభినందిస్తున్నారు. ఇంతకీ ప్రిన్స్ తన వీడియోతో పాటు ఏం చెప్పారంటే “అందరూ కొద్ది రోజులు ఇంట్లో కుటుంబంతో మాత్రమే ఉండాలని, వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండాలంటే సోషల్ లైప్ ని సాక్రిఫైజ్ చేయక తప్పదని ఇది కష్టమైనప్పటికి, ఇలా చేయడం వల్ల ఎక్కువమందికి వైరస్ సోకకుండా కాపాడిన వాళ్లమవుతాం అన్నారు”

ప్రతి ఒక్కరూ చుట్టూ పరిసరాల శుభ్రతతో పాటు, వ్యక్తిగత శుభ్రత పాటించండి . చేతులను తరచూ కడుక్కుంటూ ఉండడం వలన కూడా వైరస్ వ్యాప్తిని అరికట్టొచ్చు. చేతులని కడుకునేప్పుడు శానిటైజర్లను వాడమని అన్నారు. కొద్దిగా అనారోగ్యంగా అనిపించినా మాస్కులు ధరించండి, వైధ్యులను సంప్రదించండి. ప్రస్తుతం అందరం సమస్యలో ఉన్నం కాబట్టి, ఈ సమస్యను ఎదుర్కోవాల్సిన బాధ్యత కూడా మనందరిపైన ఉన్నదని అన్నారు. ఇదే విషయాన్ని ఒక వీడియో పోస్టు చేసి మెన్షన్ చేశారు.


You may also like

Leave a Comment