Ads
Dootha Web Series: అక్కినేని నాగచైతన్య గురించి టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాగ చైతన్య తన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో టాలీవుడ్ లో తనకంటూ సపరేట్ క్రేజ్ ను సంపాదించుకన్నాడు.
Video Advertisement
నాగచైతన్య ఓటీటీలోకి త్వరలోనే ఎంట్రీ ఇవ్వబోతున్నారు. నాగచైతన్య విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తొలిసారిగా వెబ్ సిరీస్ ‘దూత’లో నటిస్తున్నారు. విక్రమ్ ఇంతకు ముందు మనం, థాంక్యూ సినిమాలను చేసాడు. అయితే ‘థాంక్యూ’ మూవీ చేస్తునే, మరోవైపు ‘దూత’ వెబ్ సిరీస్ ను ప్రారంభించారు. అయితే దూతకు సంబంధించిన షూటింగ్ పూర్తై చాలారోజులు అవుతోంది.అయిన కూడా దీని గురించి ఇప్పటివరకు ఒక్క విషయం కూడా తెలియరాలేదు. ఈ వెబ్ సిరీస్ ను ప్రముఖ ఓటీటీ అమెజాన్ భారీ బడ్జెట్ తో రూపొందిస్తుంది.ఇక అమెజాన్ కంటెంట్ గురించి చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. కొంచెం సందేహం వచ్చిన రీషూట్స్,రీ ఎడిటింగ్స్, డిస్కషన్స్ లాంటివి తప్పకుండా చేస్తారు. అయితే ‘దూత’వెబ్ సిరీస్ విషయంలోనూ అలాంటిదే జరుగుతోందని తెలుస్తోంది. అదీ కాకుండా ప్రస్తుతం దర్శకుడు విక్రమ్, నాగచైతన్య ఫామ్ లో లేరు. ఇద్దరు థాంక్యూ సినిమాతో చేతులు కాల్చుకున్నారు. బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశను మిగిల్చింది. అందువల్ల ‘దూత’వెబ్ సిరీస్ ని విడుదల చేయడం వల్ల బజ్ ఉండకపోవచ్చని అమెజాన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.నాగచైతన్య నటించే సినిమా ఏదైనా హిట్ అయిన్నప్పుడు కానీ, ‘దూత’ పై మంచి బజ్ వచ్చాక కానీ ఈ సిరీస్ ను విడుదల చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే ప్రస్తుతం అమెజాన్ లో కంటెంట్ కి సమస్య లేదు. దాంతో ఈ వెబ్ సిరీస్ ను హోల్డ్ లో ఉంచారని సమాచారం. అయితే అమెజాన్ సంస్థ ఈ సిరీస్ విడుదల అవనప్పటికి ‘దూత2’ కోసం స్క్రిప్ట్ రాయమని విక్రమ్ కుమార్ ని కోరిందని తెలుస్తోంది. అంటే దూత రెండవ సీజన్ కూడా ఉంటుందని క్లారిటీ అయితే వచ్చేసింది. నాగచైతన్య ప్రస్తుతం ‘కస్టడీ’అనే మూవీలో నటిస్తున్నారు.
End of Article