“ఆకాశమే నీ హద్దురా” సూపర్ హిట్…కానీ అదొక్కటే మైనస్.!

“ఆకాశమే నీ హద్దురా” సూపర్ హిట్…కానీ అదొక్కటే మైనస్.!

by Mohana Priya

Ads

ఎట్టకేలకు ఆకాశం నీ హద్దురా (సూరరై పోట్రు) సినిమాతో అమెజాన్ ప్రైమ్ హిట్ అందుకుంది. ఈ సినిమా డబ్బింగ్ సినిమా అయినా, సూర్య సినిమా కాబట్టి, సూర్య ఎన్నో సంవత్సరాల నుండి మన తెలుగు ఇండస్ట్రీలో ఒక భాగం అయిపోయారు కాబట్టి ఇది మన తెలుగు సినిమానే. ఒక నిజ జీవిత కథ ఆధారంగా తీసిన ఈ సినిమా నవంబర్ 11వ తేదీ రాత్రి అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. గత కొన్ని నెలల నుండి చాలా సినిమాలు ఇలా డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ అయ్యాయి.

Video Advertisement

అందులో కొన్ని సినిమాలు మంచి ఫలితాలను ఇచ్చాయి. కొన్ని మాత్రం అనుకున్నంతగా అలరించలేకపోయాయి. దానికి కారణం అవి థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం రూపొందించినవి కావడమే. కానీ ఆకాశం నీ హద్దురా మాత్రం ఓటీటీ లో చూసినా కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇలాంటి సినిమాలు థియేటర్లో చూస్తే ఇంకా మంచి రెస్పాన్స్ వస్తుంది అనుకోండి. అది వేరే విషయం.

ఈ సినిమాకి సూర్య పర్ఫామెన్స్ హైలైట్ గా నిలిచింది. అంతే కాకుండా హీరోయిన్ గా అపర్ణ బాలమురళి, అలాగే ముఖ్య పాత్రల్లో నటించిన ఊర్వశి, పరేష్ రావల్ కూడా చాలా బాగా నటించారు. డిజిటల్ రిలీజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఈ సినిమాకి దాదాపు అందరూ పాజిటివ్ గా చెప్పినా కూడా, కొంత మంది మాత్రం కొన్ని పాయింట్స్ మైనస్ గా నిలిచాయని అంటున్నారు.

అందులో ఒకటి సూర్యకి, ఇంకా పరేష్ రావల్ కి మధ్య వచ్చే సీన్స్. ఇద్దరూ తమ పాత్రల్లో బాగా నటించారు. కానీ ఇద్దరికీ మధ్య వచ్చే సీన్స్ కొంచెం కమర్షియల్ సినిమాల్లో లాగా ఉన్నాయి అని అంటున్నారు. అంతే కాకుండా మోహన్ బాబు పాత్ర నిడివి ఇంకొంచెం ఎక్కువ సేపు ఉంటే బాగుండేది అని అంటున్నారు. ఇది మాత్రమే కాకుండా మరొక విషయాన్ని కూడా పాయింట్ అవుట్ చేశారు. అదేంటంటే.మామూలుగా సూర్యకి, శ్రీనివాస మూర్తి డబ్బింగ్ చెప్తారు. ఇప్పుడు కాదు. చాలా సంవత్సరాల నుండి సూర్యకి మనం శ్రీనివాస మూర్తి గొంతు వింటున్నాం. మధ్యలో కొన్ని సినిమాలకు మాత్రమే డబ్బింగ్ మారింది. అంటే, బ్రదర్స్ సినిమాలో ఒక పాత్రకి సూర్య డబ్బింగ్ చెప్పుకోగా, ఇంకొక పాత్రకి కార్తీ డబ్బింగ్ చెప్పారు. సూర్య సన్నాఫ్ కృష్ణన్ సినిమాలో కూడా తండ్రి పాత్ర పోషించిన సూర్య పాత్రకి శ్రీనివాస్ మూర్తి డబ్బింగ్ చెప్పగా, కొడుకు పాత్ర పోషించిన సూర్యకి వేరే డబ్బింగ్ ఆర్టిస్ట్ డబ్ చేశారు.

ఇంతకు ముందు విడుదలైన గ్యాంగ్ సినిమాకి సూర్య తనే డబ్బింగ్ చెప్పుకున్నారు. కానీ మెజారిటీ సూర్య సినిమాల్లో మనం విన్నది శ్రీనివాస మూర్తి గొంతు. కాబట్టి సూర్య అంటే సాధారణంగా శ్రీనివాస మూర్తి గొంతే మనకి స్ట్రైక్ అవుతుంది. కానీ ఈ సినిమాకి నటుడు సత్యదేవ్ డబ్బింగ్ చెప్పారు. ముందు ట్రైలర్ చూసినప్పుడు సత్యదేవ్ వాయిస్ సూర్యకి సూట్ అవ్వలేదు అన్నారు. సినిమాకి అదే మైనస్ పాయింట్ అయ్యింది అని అన్నారు.మనం ఎన్నో సినిమాలకి శ్రీనివాస్ మూర్తి వాయిస్ విన్నాం కాబట్టి, ఆ వాయిస్ కి అలవాటు పడిపోయాం. అందుకే కొంచెం డిఫరెంట్ గా అనిపించింది అని, సినిమా విడుదలైన తర్వాత ముందు 5 – 10 నిమిషాలు డబ్బింగ్ అడ్జెస్ట్ చేసుకోవడానికి టైం పట్టినా కూడా, తర్వాత సెట్ అయ్యింది అని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.


End of Article

You may also like